Telangana: బోరు బావి నుండి ఉబికి వస్తున్న పాతాళ గంగ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్న

మనిషి మనుగడ నీరు. అలాంటి నీటి కోసం బావులు, కాలువలు తవ్వడం, బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించదు. లోతైన బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మోటారు కానీ, బావి కానీ లేకుండానే లేకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగ ఉబికి వస్తోంది.

Telangana: బోరు బావి నుండి ఉబికి వస్తున్న పాతాళ గంగ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్న
Bore Water
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 07, 2024 | 4:03 PM

మనిషి మనుగడ నీరు. అలాంటి నీటి కోసం బావులు, కాలువలు తవ్వడం, బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించదు. లోతైన బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మోటారు కానీ, బావి కానీ లేకుండానే లేకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగ ఉబికి వస్తోంది. బోరు బావి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఈ అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

మొన్నటి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం మొదలై రెండు నెలలు అవుతున్నా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసాయి. గత కొన్ని రోజులుగా క్రితం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. అన్ని చోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎండిపోయిన బోర్లు కూడా ఇప్పుడు పైపుల నిండుగా నీరు పోస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా బోరు బావుల్లో నుంచి జలాలు ఉబికి వస్తున్నాయి.. ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో కనిపించింది.

లింగయ్య అనే రైతు పొలంలో బోరు ఉంది. దాని నుండి పవర్ ఆన్ చేయకుండానే నీరు ఎగిసిపడుతోంది. బోరు ఉన్న ప్రాంతం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి… బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా బోరు నుండి ఉబికి వస్తుండగా స్థానికులు వీడియో రికార్డు చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులు ,వంకలు కారణంగానే ఓవర్ ఫ్లో‌తో ఇలా గంగ ఉప్పొంగి బోరు నుండి ఇలా ఉబికి వస్తుందని అంటున్నారు స్థానికులు. మొత్తానికి.. ఇలాంటి దృశ్యాలు కనబడటం అరుదు.. అయితే… ఈ బోరుబావిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఈ బోరు బావి నుంచి ఉబికి వస్తున్న నీరు విజువల్స్ వైరల్ గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!