AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Dispute: ఏపీ ఒకే. తెలంగాణ ఏం చేస్తుంది? శ్రీశైలం, సాగర్‌ పరిధిలోని అన్ని పాయింట్లను బోర్డుకు అప్పగిస్తుందా?

ఏపీ ఒకే. తెలంగాణ ఏం చేస్తుంది? శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పరిధిలోని అన్ని పాయింట్లను బోర్డుకు అప్పగిస్తుందా? లేదా? ఇదే ఉత్కంఠ రేపుతోంది.

Water Dispute: ఏపీ ఒకే. తెలంగాణ ఏం చేస్తుంది? శ్రీశైలం, సాగర్‌ పరిధిలోని అన్ని పాయింట్లను బోర్డుకు అప్పగిస్తుందా?
Water Dispute
Venkata Narayana
|

Updated on: Oct 12, 2021 | 6:43 PM

Share

Andhra Pradesh – Telangana – Water Dispute: ఏపీ ఒకే. తెలంగాణ ఏం చేస్తుంది? శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పరిధిలోని అన్ని పాయింట్లను బోర్డుకు అప్పగిస్తుందా? లేదా? ఇదే ఉత్కంఠ రేపుతోంది. కృష్ణా బోర్డు మీటింగ్‌లో నిర్ణయాన్ని ఫైనల్‌ చేయలేదు. ఎల్లుండిలోపు ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై మరోసారి రెండు రాష్ట్రాలతో చర్చించింది KRMB. 14వ తేదీ నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కావాల్సి ఉండటంతో దశల వారీగా ప్రాజెక్ట్‌లను తీసుకోవడంపై చర్చ జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సాగర్‌ టేల్‌పాండ్‌, పులిచింతల, ఆర్డీఎస్‌ పరిధిలోని 30 పాయింట్స్‌ను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని తొలుత భావించారు. మరో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్న టైమ్‌లో ఈ నిర్ణయాలు కరెక్ట్‌ కాదని తెలంగాణ తరపున అభిప్రాయం చెప్పారు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌.

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి ఇవ్వడానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ పరిధిలోని అన్ని ఔట్‌ పాయింట్లను బోర్డు పరిధిలోకి తేవాలన్న దానిపై చర్చ జరిగింది. దానికి ఏపీ ఓకే చెప్పింది. ప్రభుత్వంతో మాట్లాడి 14వ తేదీలోపు జీవో ఇస్తామని ప్రకటించారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు.

తెలంగాణ వైపు నుంచి మాత్రం KRMB మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామన్నారు రజత్‌కుమార్‌. ఎల్లుండిలోపు తెలంగాణ ఓకే అనకపోతే బోర్డు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ పరిధిలోని ఔట్‌ పాయింట్స్‌ను తమకు అప్పగిస్తాయన్న ఆశాభాశాన్ని వ్యక్తం చేసింది బోర్డు.

Read also: Jammu encounters: జమ్ము కశ్మీర్‌లో కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టిన సైన్యం.. ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం