రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య చిచ్చు పెడుతున్న ఇసుక లారీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి వస్తున్న ఇసుక లారీలతో ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజలు నిత్య నరకం అనుభవించాల్సి వస్తుంది.. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండలంలోని ప్రజలంతా అఖిలపక్ష ఆధ్వర్యంలో రోడ్డెక్కారు.. అలుబాకా వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.. ఆ లారీల నుండి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు..

గోదావరి నదిలో ఏర్పాటుచేసిన ఇసుక రాంపుల నుండి తరలిస్తున్న ఇసుక రవాణా రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య చిచ్చు పెడుతుంది.. పొరుగు జిల్లాలోని ఇసుక లారీలు వారి గ్రామాల మీదుగా అధికలోడ్ తో వెళ్లడంతో ఆ గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు.. ఇసుక లారీల వల్ల రోడ్లు నాశనం అవుతున్నాయి.. నిత్యం ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నామని బాధిత గ్రామాలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు..ఇసుక వ్యాపారంతో లాభం మీకు.. నరకం మాకా అంటూ రోడ్డెక్కారు.. రహదారిపై వందలాది లారీలను నిలిపివేసి తమకు విముక్తి కల్పించాలని రోడ్డెక్కి నిరసన హోరెత్తుస్తున్నారు..
గోదావరి నది పర్వాహక జిల్లాల మధ్య ఇసుక క్వారీలు చిచ్చు పెడుతున్నాయి.. గృహ నిర్మాణ అవసరాలు, ఇతర అవసరాల కోసం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం సొసైటీల ద్వారా ఇసుక క్వారీలు నిర్వహిస్తుంది.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో ప్రస్తుతం ప్రభుత్వం ఇసుక క్వారీలు నిర్వహిస్తుంది.. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల ప్రాంతంలో గోదావరి తీరం వద్ద ఇసుక క్వారీల నుండి వస్తున్న లారీలు ములుగు జిల్లాలోని ఆలుబాక , వెంకటాపురం, ముళ్లకట్ట బ్రిడ్జి, ఏటూరునాగారం, ములుగు మీదుగా వరంగల్, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి..
ప్రతిరోజు 1500 నుండి 2000 ఇసుక లారీలు ఈ మార్గంలో వెళ్తున్నాయి.. ఇసుక లారీల వల్ల అనేక ప్రమాదాల సంభవిస్తున్నాయి. జాతీయ రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి పూర్తిగా ద్వంసం అయిపోతుంది.. ప్రమాదాలు నిత్య కృత్యమవుతున్నాయి.. ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి వస్తున్న ఇసుక లారీలతో ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజలు నిత్య నరకం అనుభవించాల్సి వస్తుంది.. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండలంలోని ప్రజలంతా అఖిలపక్ష ఆధ్వర్యంలో రోడ్డెక్కారు.. అలుబాకా వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.. ఆ లారీల నుండి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.. భద్రాచలం బ్రిడ్జి మీదుగా మణుగూరు నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన లారీలు సులువుగా మూలకట్ట బ్రిడ్జి మీద నుండి వెళ్లడం వల్ల తమ రోడ్లు నాశనం అవుతున్నాయని ఆరోపించారు.. ఇసుక లారీల ఓవర్ స్పీడ్ తో తమ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు..ఆ లారీల నుండి తమకు విముక్తి కల్పించాలని ఆందోళన చేపట్టారు.. రహదారిని దిబ్బందించి వందలాది ఇసుక లారీలను రోడ్లపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు.. చివరకు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








