Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ఫ్యాన్స్..
Gemini Theatre Warangal: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల
Gemini Theatre Warangal: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో ఈ రోజు సందడిగా నెలకొంది. ఈ క్రమంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ సంఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.
Also Read: