Warangal: పెళ్లింట్లో విషాదం.. కన్నుల పండువగా కూతురు.. అదే పందిట్లో కుప్పకూలిన వధువు తండ్రి

Warangal: పెళ్లింట్లో ఊహించని విషాదం అలుముకుంది..కన్నుల పండువగా కన్నబిడ్డ పెళ్ళి చేసిన ఓ తండ్రి అదే పెళ్లి వేడుక లో కన్ను మూశాడు.. ఆ తండ్రి మరణంతో పెళ్లింట రోధనలు మిన్నంటాయి..

Warangal: పెళ్లింట్లో విషాదం.. కన్నుల పండువగా కూతురు.. అదే పందిట్లో కుప్పకూలిన వధువు తండ్రి
Waramgal Wedding
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2022 | 1:56 PM

Warangal: పెళ్లింట్లో ఊహించని విషాదం అలుముకుంది..కన్నుల పండువగా కన్నబిడ్డ పెళ్ళి చేసిన ఓ తండ్రి అదే పెళ్లి వేడుక లో కన్ను మూశాడు.. ఆ తండ్రి మరణంతో పెళ్లింట రోధనలు మిన్నంటాయి.. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వధువు తండ్రి తన కూతురికి అల్లుడు అరుంధతి(Arundhati) నక్షత్రం చూపెట్టే లోపే తనువు చాలించాడు.. అదే పెళ్లి వేడుకలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన వరంగల్(Warangal) నగరంలో చోటుచేసుకుంది.

వేణురావుకాలనీ కి చెందిన బొరిగం వెంకటరామ్ నర్సయ్య అనేవ్యక్తి కాశిబుగ్గలోని పద్మశాలి కల్యాణ మండపంలో తన కూతురు హారిక పెళ్లి వేడుక నిర్వహించాడు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపాడు. కూతురు పెళ్లి అయ్యాక కొద్దీ నిమిషాల వ్యవదిలోనే తనువు చాలించాడు.

పెళ్లి వేడుక ముగిసిన అనంతరం అతిధులంతా వదు వారులను ఆశీర్వదిస్తున్నారు.. బంధుమిత్రుల కలయిక కల్యాణ మండపంలో కలకలలు కనిపిస్తున్నాయి.. ఇంతలోనే బోరున విలపిస్తు రోధనలు మిన్నంటాయి. వధువు తండ్రి వెంకట్రామ్ నర్సయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.. దీంతో బంధుమిత్రులంతా శోక సముద్రంలో మునిగిపోయారు.. భాజా భజంత్రీలు మూగబోయాయి.. వధువు ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఆ ప్రాంతం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: America: చికాగోలో కారు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు

Tirumala: మండుతున్న ఎండలు.. తిరుమల గిరులపై భక్తులు తీవ్ర ఇక్కట్లు..