America: చికాగోలో కారు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు..

America Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చికాగోలో(Chicago) రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు (Indian Students) మృతి చెందారు.

America: చికాగోలో కారు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు..
Car Crash In Chicago
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2022 | 10:21 AM

America Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చికాగోలో(Chicago) రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు (Indian Students) మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గత గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ విద్యార్థులతో వెళ్తున్న టయోటా కారు మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది

చికాగో సమీపంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన జరిగింది. పిక్నిక్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేటలో నివాసముండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ పద్మజా రాణి చిన్న కుమారుడు పెచెట్టి వంశీకృష్ణ(23), అతని స్నేహితుడు పవన్‌ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న వారి స్నేహితులు డి.కల్యాణ్‌, కె.కార్తీక్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్‌కు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది.

Also Read: Tirumala: మండుతున్న ఎండలు.. తిరుమల గిరులపై భక్తులు తీవ్ర ఇక్కట్లు..

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు.. ఒకరి మృతి..