Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు.. ఒకరి మృతి..

Panadu District:  ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము  రోడ్డు ప్రమాదం సంభవించింది.

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు.. ఒకరి మృతి..
Road Accident
Follow us
Basha Shek

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 24, 2022 | 7:33 AM

Panadu District:  ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము  రోడ్డు ప్రమాదం సంభవించింది. దాచేపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని జగన్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి కనిగిరి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఏఎస్ పేటకు రాత్రి బయలు దేరింది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ బస్సును దామరచర్ల దగ్గర హై స్పీడ్ లో వెళ్తూ ఓవర్టేక్ చేయబోతే బస్సులోని ప్రయాణికులు వారించారు. ఈ క్రమంలో 25 కిలోమీటర్లు దాటిన తర్వాత దాచేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగమే కారణమని పేర్కొన్నారు. జగన్ ట్రావెల్స్ బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో గుర్రాన్ని కనిపెడితే మీరే గ్రేట్.. 99% ఫెయిల్!

HPCL Recruitment: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో..