AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో దంపతుల హత్య.. ఝార్ఖండ్ లో దారుణం

ప్రపంచం సాంకేతికతను అందుకని ముందుకు దూసుకుపోతున్నా.. మారుమూల పల్లెల్లో ఇంకా మూఢ నమ్మకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసాలతో దాడులకు తెగబడుతున్నారు. చేతబడి చేస్తున్నారని అనుమానం పెంచుకుని...

చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో దంపతుల హత్య.. ఝార్ఖండ్ లో దారుణం
Chennai Murder
Ganesh Mudavath
|

Updated on: Apr 23, 2022 | 8:14 PM

Share

ప్రపంచం సాంకేతికతను అందుకని ముందుకు దూసుకుపోతున్నా.. మారుమూల పల్లెల్లో ఇంకా మూఢ నమ్మకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసాలతో దాడులకు తెగబడుతున్నారు. చేతబడి చేస్తున్నారని అనుమానం పెంచుకుని హత్యలకూ వెనుకాడటం లేదు. ఝార్ఖండ్(Jharkhand) గుమ్లా జిల్లాలోని భగత్ బకుమా గ్రామానికి చెందిన సుమిత్రా దేవీ కుమార్తెకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. అదే గ్రామంలో నివాసముండే లుంద్రా చిక్ బరాయిక్, ఆయన భార్య పుల్వామా దేవి దంపతులు చేతబడి చేయడంతోనే తన కుమార్తె ఆరోగ్యం క్షీణించినట్లు సుమిత్రా దేవి భావించింది. లుంద్రా దంపతులపై కక్ష పెంచుకుంది. వారితో తగాదాకు దిగింది. దీంతో సుమిత్రా దేవి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని లుంద్రా దంపతులు ఇటీవలే గ్రామ పెద్దలను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న సుమిత్రాదేవి, ఆమె కుమారుడు రవీంద్ర కోపంతో రగిలిపోయారు. లుంద్రా ఇంట్లోకి చొరబడి ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి తీవ్రంగా దాడి చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో లుంద్రా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి, తమదైన శైలిలో విచారణ చేపట్టగా సుమిత్రా దేవీ, ఆమె కుమారుడు రవీంద్ర లు నిందితులని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవీచదవండి.

 Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..

Follow Us
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..