Indian Railway: రైల్వే కీలక నిర్ణయం.. 8 రైళ్ల రూట్లలో మార్పులు.. ఎందుకో తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే సౌత్‌ రైల్వే జోన్ (South Western Railway) లోండా జంక్షన్-మిరాజ్ రైలు సెక్షన్ మధ్య డబ్లింగ్ పనులను ప్రారంభించబోతోంది...

Indian Railway: రైల్వే కీలక నిర్ణయం.. 8 రైళ్ల రూట్లలో మార్పులు.. ఎందుకో తెలుసా..?
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2022 | 7:51 PM

Indian Railway: భారతీయ రైల్వే సౌత్‌ రైల్వే జోన్ (South Western Railway) లోండా జంక్షన్-మిరాజ్ రైలు సెక్షన్ మధ్య డబ్లింగ్ పనులను ప్రారంభించబోతోంది. లోండా జంక్షన్-మిరాజ్ రైలు విభాగంలో డబ్లింగ్ కారణంగా నాన్-ఇంటర్‌లాకింగ్ బ్లాక్ తీసుకోబడుతుంది. ఈ నాన్-ఇంటర్‌లాకింగ్ బ్లాక్ కారణంగా లోండా జంక్షన్-మీరాజ్ రైలు సెక్షన్ మీదుగా వెళ్లే అనేక రైళ్లు ప్రభావితమవుతాయి. ఈ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ బ్లాక్‌ కారణంగా 8 రైళ్ల రూట్‌ను మారుస్తున్నట్లు నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే (North Western Railway) చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ కెప్టెన్‌ శశికిరణ్‌ తెలిపారు . వీటిలో జోధ్‌పూర్-బెంగళూరు రైలు, అజ్మీర్-మైసూర్ రైలు, అజ్మీర్-బెంగళూరు రైలు ఉన్నాయి.

ఈ రైళ్ల రూట్‌లో మార్పులు:

  1. జోధ్‌పూర్ నుండి బెంగళూరు మధ్య నడుస్తున్న రైలు నంబర్ 16507: ఏప్రిల్ 23, 28,30 తేదీలలో జోధ్‌పూర్ నుండి బయలుదేరుతుంది. సతారా, కరాడ్, సాంగ్లీ, మిరాజ్, ఘటప్రభ, బెలగావి, లోండా, ధార్వాడ్ షెడ్యూల్ చేసిన రూట్‌కు బదులుగా, పూణె-సోలాపూర్-హోత్గి-విజయపుర-బాగల్‌కోట్-గడగ్-హుబ్బల్లి రూట్ల మీదుగా నడుస్తుంది.
  2. రైలు నంబర్- 16508: బెంగళూరు నుండి జోధ్‌పూర్ మధ్య నడుస్తుంది. బెంగళూరు నుండి ఏప్రిల్ 25, 27 ఏప్రిల్, మే 2వ తేదీలలో బయలుదేరుతుంది. ధార్వాడ్, లోండా, బెలగావి, ఘటప్రభ, మిరాజ్, సాంగ్లీ, కరాడ్, సతారా షెడ్యూల్ రూట్‌ల మీదుగా వెళ్లే బదులు.. హుబ్బల్లి – గడగ్- బాగల్‌కోట్- విజయపుర- హోత్గి-సోలాపూర్-పూణే రూట్ల మీదుగా నడుస్తుంది.
  3. రైలు నంబర్ 16209: అజ్మీర్ నుండి మైసూర్ మధ్య నడుస్తుంది. అజ్మీర్ నుండి ఏప్రిల్ 24, 29 ఏప్రిల్ , మే 1వ తేదీలలో బయలుదేరుతుంది. సతారా, కరాడ్, సాంగ్లీ, మిరాజ్, ఘటప్రభ, బెలగావి, లోండా, ధార్వాడ్ షెడ్యూల్ చేసిన రూట్‌కు బదులుగా, పూణె- సోలాపూర్- హోత్గి- విజయపుర- బాగల్‌కోట్- గడగ్- హుబ్బల్లి రూట్ల మీదుగా మీదుగా నడుస్తుంది.
  4. రైలు నంబర్ 16210: మైసూర్ నుండి అజ్మీర్ మధ్య నడుస్తుంది. మైసూర్ నుండి ఏప్రిల్ 26, 28 ఏప్రిల్, మే 3వ తేదీలలో బయలుదేరుతుంది. ధార్వాడ్, లోండా, బెలగావి, ఘటప్రభ, మిరాజ్, సాంగ్లీ, కరాడ్, సతారా షెడ్యూల్ రూట్‌కు బదులుగా హుబ్బల్లి – గడగ్- బాగల్‌కోట్- విజయపుర-హోత్గి-సోలాపూర్-పూణే రూట్ల మీదుగా బయలుదేరుతుంది.
  5. రైలు నంబర్-16533: జోధ్‌పూర్ నుండి బెంగళూరు మధ్య నడుస్తుంది. ఇది జోధ్‌పూర్ నుండి ఏప్రిల్ 27, మే 4న బయలుదేరుతుంది. ఈ రైలు దాని షెడ్యూల్ రూట్ సతారా, మిరాజ్, బెలగావి, లోండా, ధార్వాడ్, హుబ్బల్లికి బదులుగా పూణే-సోలాపూర్-హోత్గి-విజయపుర-బాగల్‌కోట్-గడగ్ రూట్‌లో నడుస్తుంది.
  6. బెంగుళూరు, జోధ్‌పూర్ మధ్య నడిచే రైలు నంబర్-16534: బెంగళూరు నుండి ఏప్రిల్ 24, మే 1 తేదీలలో బయలుదేరుతుంది. ఈ రైలు దాని షెడ్యూల్ రూట్ హుబ్బల్లి, ధార్వాడ్, లోండా, బెలగావి, మిరాజ్, సతారా కాకుండా మార్చబడిన గడగ్-బాగల్‌కోట్-విజయపుర-హోత్గి-సోలాపూర్-పుణే రూట్లలో నడుస్తుంది.
  7. రైలు నంబర్ 16531: అజ్మీర్ నుండి బెంగళూరు మధ్య నడుస్తుంది. ఇది అజ్మీర్ నుండి ఏప్రిల్ 25, మే 2న బయలుదేరుతుంది. సతారా, కరాడ్, సాంగ్లీ, మిరాజ్, ఘటప్రభ, లోండా, ధార్వాడ్, హుబ్బల్లి షెడ్యూల్ రూట్‌కు బదులుగా, పూణే-సోలాపూర్- హోట్గి-విజయపుర- బాగల్‌కోట్- గడగ్ రూట్లలో నడుస్తుంది.
  8. బెంగుళూరు నుండి అజ్మీర్ మధ్య నడిచే రైలు నంబర్-16532: ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుండి బయలుదేరుతుంది. హుబ్బల్లి, ధార్వాడ్, లోండా, బెలగావి, మిరాజ్, సాంగ్లీ, కరాడ్, సంతారా షెడ్యూల్ చేసిన రూట్‌కు బదులుగా.. గడగ్-బాగల్‌కోట్-విజయపుర-హోత్గి-సోలాపూర్-పూణే మీదుగా నడుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

EPFO: పదవీ విరమణకు ముందు పీఎఫ్‌ ఖాతా నుంచి ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..? నియమాలు ఏమిటి?

Gautam Adani: మరో రెండు కీలక రంగాల్లో అదానీ ఎంట్రీ.. ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో ఢీ అంటే ఢీ..

SBI ATM: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!