AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Shortage: దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఉత్పత్తి పెరుగుతున్నట్లు వెల్లడి..

దేశంలో బొగ్గు(Coal) కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని, నెలకు సరిపడా బొగ్గు ఉందని పేర్కొంది...

Coal Shortage: దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఉత్పత్తి పెరుగుతున్నట్లు వెల్లడి..
Coal Mine
Srinivas Chekkilla
|

Updated on: Apr 23, 2022 | 8:13 PM

Share

దేశంలో బొగ్గు(Coal) కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని, నెలకు సరిపడా బొగ్గు ఉందని పేర్కొంది. విద్యుత్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరాను నిరంతరం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Joshi) తెలిపారు. దేశంలోని సగానికి పైగా పవర్ ప్లాంట్‌(Power Plant)లలో అవసరమైన దానికంటే చాలా తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది దేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితి లేదని మంత్రి ఈరోజు చెప్పారు. కోల్ ఇండియా సహా వివిధ ప్రాంతాల్లో 725 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా తెలిపారు. అదే సమయంలో థర్మల్ పవర్ ప్లాంట్‌లో 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని గుర్తు చేశారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 8 శాతానికి పైగా పెరిగి 77 మిలియన్ టన్నులు దాటింది. కోల్ ఇండియా ఉత్పత్తి 4 శాతానికి పైగా పెరిగి 62 మిలియన్ టన్నులకు చేరింది. ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత ఏర్పడింది. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ బోగీల సంఖ్యను 20 శాతం పెంచడంతో బొగ్గు సరఫరా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 2022 మొదటి 15 రోజులలో గృహ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది.

మరిన్ని బిసినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also.. Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!