India – China: చైనాకు భారత్ గట్టి దెబ్బ.. ఆ వీసాలను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం

చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం చెప్పింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను(Tourist Visa) సస్సెండ్‌ చేస్తున్నట్టు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) వెల్లడించింది. కరోనా కారణంగా...

India - China: చైనాకు భారత్ గట్టి దెబ్బ.. ఆ వీసాలను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 24, 2022 | 5:15 PM

చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం చెప్పింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను(Tourist Visa) సస్సెండ్‌ చేస్తున్నట్టు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) వెల్లడించింది. కరోనా కారణంగా భారత విద్యార్ధులు చైనా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి చదువుకునేందుకు డ్రాగన్ దేశానికి వెళ్లగా.. వారి రాకను చైనా(China) తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇండియా వీసాలు సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, పాకిస్తాన్‌, శ్రీలంక, థాయిలాండ్‌ తదితర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను మాత్రం చైనా ఆహ్వానించింది. గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి భారత పర్యటనకు వచ్చిన సమయంలో మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్‌ విద్యార్థుల సమస్యను పరిష‍్కరించాలని కోరారు. అయినప్పటికీ చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇక లాభం లేదనుకున్న భారత్.. పర్యాటక వీసాలను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది.

ఏప్రిల్ 20న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్‌ జారీ చేసిన నివాస అనుమతి ఉన్నవారు, ఈ-వీసా ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు లేదా బుక్‌లెట్ ఉన్నవారు, పీఐఓ కార్డ్ ఉన్నవారు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లకు మాత్రమే భారత్‌లోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది.

గతంలో చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్నవటువంటి కొన్ని ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ పన్నులు విధించింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి ఇలా చేసినట్లు తెలిపింది. హైడ్రోఫ్లోరో కార్బన్‌, సోడియం హైడ్రో సల్ఫేట్‌, అల్యూమినియం, సిలికాన్‌ సీలెంట్‌, హైడ్రో ఫ్లోరో కార్బన్‌ మిశ్రమాలు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా కొత్తగా విధించిన ఈ సుంకాన్ని ఇండియా కరెన్సీలో చెల్లించాలని సీబీఐసీ స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లక్ చేయండి

Read Also….

  Viral Video: ఇది కదా కరేజ్.. రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసినా.. ఇంచ్ కూడా వెనక్కి తగ్గని కింగ్ కోబ్రా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!