AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visit Visas: విజిట్‌ వీసాల రెన్యువల్‌ విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ఆందోళనలో ప్రవాసీయులు

Visit Visa: సౌదీ అరేబియా (Saudi Arabia)లో విజిట్‌ వీసాల పునరుద్దరణ గడువుపై ఆ దేశం అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది..

Visit Visas: విజిట్‌ వీసాల రెన్యువల్‌ విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ఆందోళనలో ప్రవాసీయులు
Subhash Goud
|

Updated on: Apr 24, 2022 | 5:10 PM

Share

Visit Visa: సౌదీ అరేబియా (Saudi Arabia)లో విజిట్‌ వీసాల పునరుద్దరణ గడువుపై ఆ దేశం అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది వరకు గడువు ఉన్న ఈ వీసాల గడువు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మూడు నెలలకే కుదించడంతో వందలాది తెలుగు ప్రవాసీల కుటుంబాల స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ దేశంలో పని చేస్తున్న ప్రవాసీయులు (Immigrants).. వారి తల్లిదండ్రులు, భార్యా పిల్లలను పిలిపించుకోవడానికి సౌదీ ఆరేబియా ప్రభుత్వం విజిట్‌ వీసాలు జారీ చేస్తుంది. దీని గడువు మూడు నెలలు ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ఏడాది వరకు రెన్యువల్‌ (Renewal) చేసుకోవచ్చు. రెండు, మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది కుటుంబాలు ఈ వీసాలతో గరిష్టంగా ప్రయోజనం పొందుతున్నారు.

ఐటీ రంగంలో పని చేస్తున్న చాలా మంది దీనిని వినియోగించుకుంటున్నారు. అయితే నాలుగు రోజులుగా ఈ వీసా పునరుద్దరణను అధికారులు నిలిపివేశారు. దీంతో గడువు సమీపిస్తుండటంతో కుటుంబాలన్నీ తిరుగు పయనం కావాల్సిన పరిస్థితి నెలకొంది. భార్యా పిల్లలు ఏడాది పాటు తనతోనే ఉంటారని భావించి వస్తే.. ఇప్పుడు వీసా రెన్యువల్‌ కాకపోవడంతో వారిని స్వదేశానికి పంపిస్తున్నానని విశాఖపట్టణానికి చెందిన శ్రీరాజ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా రెన్యువల్‌ను నిలిపివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన మరొక వ్యక్తి తెలిపారు. ముందుగా సాంకేతిక సమస్య అనుకున్నా, తర్వాత అధికారులు గడువును కుదించారని తెలిసి షాక్‌కు గురయ్యామని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మరో వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు. గడువును కుదించి రెన్యువల్‌ను నిలిపివేయడంతో వందలాది ప్రవాస భారతీయులు తమ కుటుంబ సభ్యులను వెనక్కి పంపించేస్తున్నారు.

ఫ్యామిలీ వీసాలకు ఖర్చు ఎక్కువనే..

సౌదీలో ప్రవాసీలు కుటుంబ సభ్యులను తమతో పాటు ఉంచుకోవడానికి వీసాలను జారీ చేస్తారు. దీనిని ప్రతి కుటుంబ సభ్యుడిపై ఏడాదికి 2వేల రియళ్ల ఫీజుతో పాటు వైద్య బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రవాస భారతీయులు సులభంగా లభించే విజిట్‌ వీసాలపై తల్లిదండ్రులు, భార్యా పిల్లలను తీసుకురావడం అనేది సర్వసాధారణంగా మారింది. ఇలా వీసాలు క్రమేపి పెరుగుతుండటంతో దీనిని నిలిపివేశారు. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎవరైనా విజిట్‌ వీసాలను ఏడాది వరకు రెన్యువల్‌ చేసుకోవాలని అనుకుంటే ఫ్యామిలీ వీసా కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Ebola: ఆఫ్రికాలో ఎబోలా గుబులు.. ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న వైరస్

ఆ అంశంపై ప్రత్యేక కోర్సు.. విద్యార్థులతో పాటు లెక్చరర్లూ వీడియోలు చూసేలా.. ఇంతకీ ఎక్కడంటే