Ebola: ఆఫ్రికాలో ఎబోలా గుబులు.. ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న వైరస్

ప్రపంచ దేశాలను కరోనా(Corona) వైరస్ వణికిస్తోంది. వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్లీ మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా(Ebola) పంజా విసురుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి....

Ebola: ఆఫ్రికాలో ఎబోలా గుబులు.. ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న వైరస్
corona
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 24, 2022 | 4:14 PM

ప్రపంచ దేశాలను కరోనా(Corona) వైరస్ వణికిస్తోంది. వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్లీ మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా(Ebola) పంజా విసురుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్​ఆఫ్‌ కాంగోలో వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని వెల్లడించింది. ఈక్వెటర్‌ (Ecuador) ప్రావిన్స్‌లోని మబండకా పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ దేశంలో 1976 నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్‌ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, అతడు మరణించాడు.

ప్రాణాంతక ఎబోలా వైరస్‌ ఆఫ్రికా దేశాలను కలవరపెడుతోంది. 2020లో వందల మందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన తర్వాత ఈక్వెటర్ లో కొత్త కేసు నమోదైంది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ‘‘కొవిడ్‌ సహా ఈ ప్రాంతంలో అంటువ్యాధుల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. సమర్థ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర నిఘా, సన్నద్ధత ఆవశ్యకతను ఇవి సూచిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లక్ చేయండి

Read Also….  Viral Video: ఇది కదా కరేజ్.. రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసినా.. ఇంచ్ కూడా వెనక్కి తగ్గని కింగ్ కోబ్రా..Also Read

  Viral Video: ఇది కదా కరేజ్.. రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసినా.. ఇంచ్ కూడా వెనక్కి తగ్గని కింగ్ కోబ్రా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!