Paddy on Road: ఓ వైపు వర్షం, మరో వైపు వాహనాల మద్య నరకం.. కొనుగోలు కేంద్రాలు లేక రోడ్లపై, కల్లాల్లో ధాన్యం!
దుక్కి దున్నిన దగ్గర నుంచి.. నారు పోసే వరకు.. నాటు వేసిన దగ్గర నుంచి.. కోత కోసే వరకు అన్నదాతకు అడుగడుగునా కష్టాలే.. అన్నీ భరించి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. ఆ పంటను అమ్ముకోవడానికి అరిఘోషలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
Paddy on Road: దుక్కి దున్నిన దగ్గర నుంచి.. నారు పోసే వరకు.. నాటు వేసిన దగ్గర నుంచి.. కోత కోసే వరకు అన్నదాతకు అడుగడుగునా కష్టాలే.. అన్నీ భరించి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. ఆ పంటను అమ్ముకోవడానికి అరిఘోషలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేతికొచ్చిన పంట కోసిన తర్వాత ఎక్కడ పోయాలో తెలియక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనా, కల్లాల్లో ధాన్యం పెట్టుకుని రైతులు పడి గాపులు గాస్తున్నారు. రాత్రనక పగలనక రోడ్లపైనే ఉంటున్నారు. ఓ వైపు వర్షం, మరో వైపు వాహనాల మద్య నరకం అనుభవిస్తున్నారు. ప్రతి గ్రామంలో కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కేవలం కోన్ని చోట్ల మాత్రమే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు.. కమ్ముకుంటున్న మబ్బులు అన్నదాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో కల్లాలు, రహదారులపై రాశులుగా పోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్ఫాలిన్‌లను కప్పుతున్నారు. మరోవైపు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆర్ధిక ఇబ్బందులతో కొందరు రైతులు దళారులు, వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. వర్ని, మోస్రా, చందూర్, రుద్రూర్, కోటగిరి మండలాల పరిధిలో 90 శాతానికి పైగా ధాన్యం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. జిల్లాలొని జాతీయ రహదారులతో పాటు, గ్రామాల్లోకి వేళ్లే దారుల్లో ఎక్కడ చూసినా ధాన్యమే కనిపిస్తోంది. కల్లాలు అందుబాటులో లేకపోవడంతోనే రోడ్లపై ఆర బోస్తున్నామని చేపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కోనుగోళ్లు స్పీడప్ చేయాలని కోరుతున్నారు రైతులు.
Read Also… CJI NV Ramana: ‘తక్షణ న్యాయం’పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ