Telangana: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పులి చర్మం అనుకుంటే మీరు పిచ్చోళ్లే.. మాములు మాయ కాదు

 "పొట్టొడ్ని పొడుగోడు తంతే.. పొడుగోడ్ని పోచమ్మ కొడుతుంది".. ఇది తెలంగాణలో రెగ్యులర్‌గా ప్రస్తావించే సామెత. తాజాగా ఈ సామెతకు యాప్ట్ అయ్యే క్రైమ్ ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో వెలుగుచూసింది.

Telangana: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పులి చర్మం అనుకుంటే మీరు పిచ్చోళ్లే.. మాములు మాయ కాదు
Cheating
Follow us

|

Updated on: Apr 04, 2022 | 1:23 PM

 Warangal district: “పొట్టొడ్ని పొడుగోడు తంతే.. పొడుగోడ్ని పోచమ్మ కొడుతుంది”.. ఇది తెలంగాణలో రెగ్యులర్‌గా ప్రస్తావించే సామెత. తాజాగా ఈ సామెతకు యాప్ట్ అయ్యే క్రైమ్ ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో వెలుగుచూసింది. వన్యప్రాణులు చర్మం, దంతాలకు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూగ జంతువులను, అంతరించిపోతున్న యానిమల్స్‌ను ట్రాప్ చేసి ప్రాణాలు తీస్తున్నారు కొందరు. దీంతో అటవీ అధికారులు, పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది… ఇలాంటి వేటగాళ్ల బెండు తీస్తున్నారు. కఠినమైన సెక్షన్స్ పెట్టి జైల్లో వేస్తున్నారు. దీంతో కేటుగాళ్లు రూట్ మార్చారు. రిస్క్ లేకుండా ఉండేందుకు కొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. తాజాగా మేక చర్మానికి రంగులు అద్ది పులి చర్మంగా విక్రయిస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు(Atmakur ) పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఎండి మహ్మద్ గౌస్ పల్లి గ్రామంలో పక్కా సమాచారంతో దాడులు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేక చర్మానికి ఒరిజినల్ టైగర్ స్కిన్‌లా రంగులువేసి.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ట్రై చేశారు. పులి చర్మమని నమ్మించి ఓ వ్యక్తికి 16 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ చివరి నిమిషంలో టాస్క్‌పోర్స్ పోలీసుల రాకతో వారి ప్లాన్ రివర్సయ్యింది. మేక చర్మానికి రంగులు వేసిన విధానం చూసి..  వారు చాన్నాళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాపం ఇలా ఎందరు మోసపోయారో.. ఏమో. కానీ నిందితుల ఆర్ట్ వర్క్‌ను మాత్రం ప్రశంసించాల్సిందే. ఏ మాత్రం అనుమానం కలగకుండా పెయింట్ వేశారు. చూసినవారు ఎవరైనా అది పులి చర్మమే అనుకుంటారు. కాగా ఈ కేసులో రాజేష్, వుండవర్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read:  Viral Video: కొండ చిలువతో మజాక్ ఆడబోయిన సింహం పిల్ల.. పైథాన్ రిప్లై చూస్తే కంగుతింటారు