Telangana: చేతిలో రైఫిల్ ఉంటే ఆ రాజసమే వేరు.. రాయల్ గేమ్‌పై పెరుగుతున్న మోజు

బొమ్మ తుపాకీతోనైనా గురిచూసి కొట్టాలనే కోరిక చాలామందికి ఉంటుంది. రైఫిల్ షూటింగ్ అనేది చాలామందికి ఓ ప్యాషన్. ఈ మధ్య ఒలింపిక్స్‌లో మను బాకర్ రైఫిల్ షూటింగ్ లో భారత దేశకీర్తిని ఇనుమడించ చేయడంతో ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది.

Telangana: చేతిలో రైఫిల్ ఉంటే ఆ రాజసమే వేరు.. రాయల్ గేమ్‌పై పెరుగుతున్న మోజు
Firearms Training
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Aug 28, 2024 | 6:31 PM

బొమ్మ తుపాకీతోనైనా గురిచూసి కొట్టాలనే కోరిక చాలామందికి ఉంటుంది. రైఫిల్ షూటింగ్ అనేది చాలామందికి ఓ ప్యాషన్. ఈ మధ్య ఒలింపిక్స్‌లో మను బాకర్ రైఫిల్ షూటింగ్ లో భారత దేశకీర్తిని ఇనుమడించ చేయడంతో ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది. అదే స్ఫూర్తితో చాలామంది యువతి యువకులు, చిన్నారులు సైతం షూటర్స్‌గా మారేందుకు తెగ ఆరాట పడుతున్నారు. రైఫిల్, ఫిష్టల్ షూటింగ్ కోచింగ్స్‌లో రాటుతేలుతూ ఒలంపిక్స్ కు గురి పెడుతున్నారు.

చేతిలో రైఫిల్ ఉంటే ఆ రాజసమే వేరు.. సహజంగా రైఫిల్ షూటింగ్ ను రాయల్ గేమ్ గా బావిస్తుంటారు. ఎగ్జిబిషన్‌లో, సంతల్లో బొమ్మ తుపాకీ దొరికితే చాలు గురిచూసి కొట్టాలని చూస్తుంటాం.. చాలామందికి రైఫిల్ షూటింగ్ అనేది ప్యాషన్. రాయల్ గేమ్ గా భావించే రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందడం, నిపుణుల చేత ట్రైనింగ్ సహజంగా మెట్రో నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా రైఫిల్ షూటింగ్ అనేది ఫుల్ క్రేజీగా మారింది.

క్రీడలపై ఉత్సాహం చూపే చిన్నారులు, యువతీయువకులు రైఫిల్, పిస్టల్ షూటింగ్ పై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు.. ఇలాంటి ఉత్సాహవంతులకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేక రైఫిల్ షూటింగ్ శిక్షణ కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. వరంగల్ యువతీ యువకులు రైఫిల్ షూటింగ్ పై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన క్రీడలకు రైఫిల్ షూటింగ్ కు పూర్తి వ్యత్యాసం ఉంటుంది.. రైఫిల్ షూటింగ్ కు ఎంతో ఏకాగ్రత ఓర్పు అవసరం అంటున్నారు నిపుణులు. స్పాట్

ఒలింపిక్స్ లో మనుభాకర్ మెడల్స్ సాధించడంతో ఒక్కసారిగా షూటింగ్ పై క్రేజీ పెరిగింది. వరంగల్‌‌లోని రీలోడ్ రైఫిల్ షూట్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందుతున్న ఈ యువ షూటర్లు ఈ క్రీడలో విశేష ప్రతిభను కనబరుస్తూ, భవిష్యత్తులో భారత్‌ కు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా గురి పెడుతున్నారు. ఇంతటి ఖరీదైన ఆటలో ఇప్పుడు వరంగల్ యువత విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వరంగల్ లో శిక్షణ పొందుతున్న యువ షూటర్లు త్వరలో జరగనున్న నేషనల్ షూటింగ్ కాంపిటిషన్స్‌లో పాల్గొనేందుకు సాధన చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్న జాతీయ షూటర్ ప్రసన్నకుమార్ నేతృత్వంలో వీరికి శిక్షణ ఇస్తున్నారు. యువత క్రేజ్‌కి తగ్గట్లు రైఫిల్ షూటర్ ట్రైనింగ్ అందుబాటులోకి తెచ్చారు. కోచింగ్ తీసుకునే వారంతా నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాలనే ఆశయంతో సాధన చేస్తున్నారు. కొందరు ఒలంపిక్స్ లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు చాటాలని రైఫిల్ గురిచూసి కొడుతుంటే, మరికొందరు యూనిఫామ్ సర్వీస్‌లో ఉద్యోగాలు సాధించడానికి రైఫిల్ షూటింగ్ దోహద పడుతుందని చెబుతున్నారు. వీరికి శిక్షణ ఇస్తున్నవారు మాత్రం రైఫిల్ షూటింగ్ క్రమశిక్షణ, ఏకాగ్రతతో కలిగిన క్రీడ అని ఇందులో మెలకువలు నేర్పుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..