AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన అమెరికా టూర్ టికెట్..!

వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు. నాలుగున్నర ఏళ్ళుగా కలిసి పనిచేసారు. పదవి ముగుస్తున్న సమయంలో విభేదాలు భగ్గమన్నాయి. విదేశాలకు వెళ్ళిన మేయర్, ఇంచార్జ్ బాధ్యతలు డిప్యూటీ మేయర్‌కు ఇవ్వకపోవడంతో విభేదాలు బయటపడ్డాయి.

Telangana: మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన అమెరికా టూర్ టికెట్..!
Brs
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 28, 2024 | 5:54 PM

Share

వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు. నాలుగున్నర ఏళ్ళుగా కలిసి పనిచేసారు. పదవి ముగుస్తున్న సమయంలో విభేదాలు భగ్గమన్నాయి. విదేశాలకు వెళ్ళిన మేయర్, ఇంచార్జ్ బాధ్యతలు డిప్యూటీ మేయర్‌కు ఇవ్వకపోవడంతో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలివానగా మారి, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. మొత్తానికి బీఅర్ఎస్‌లో మేయర్, డిప్యూటీ వర్గంగా చీలిపోయింది కౌన్సిల్.

కరీంనగర్ మున్సిపాలిటీ కార్పోరేషన్‌లో బీఅర్ఎస్ గత ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అప్పుడు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా మేయర్, డిప్యూటీ పదవులని గులాబీ పార్టీ దక్కించుకుంది. మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూపరాణి ఎన్నిక అయ్యారు. మొదట సునీల్ రావు ఎన్నికని కూడా కొంత మంది కార్పోరేటర్లు వ్యతిరేకించారు. అధిష్టానం జోక్యం చేసుకొవడంతో అందరూ‌ సైలెంట్ అయ్యారు. నాలుగున్నర ఏళ్ళుగా ఎలాంటి విభేదాలు లేకుండా మున్సిపాలిటీ పాలన సాగుతుంది.

ఎప్పుడైతే రాష్ట్రంలో బీఅర్ఎస్ అధికారం కొల్పోయిందో అప్పటి నుండి మేయర్ వ్యవహార శైలిలో మార్పు మొదలయ్యాయి. తాజాగా అమెరికా వెళ్ళేందుకు టికెట్ కొనుగోలు చేశారు మేయ్. ముందుగా నెల రోజుల పాటు అమెరికా లో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే మేయర్ ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు డిప్యూటీ మేయర్‌. మేయర్ సమాచారం లేకుండానే విదేశి పర్యటన కి ఎలా వెళ్తారంటూ డిప్యూటీ మేయర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు పలువురు కార్పొరేటర్లు.

మేయర్ నెల రోజులు కాకుండా పదిహేను రోజులు మాత్రమే అమెరికాలో ఉంటున్నానని టికెట్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వచ్చే నెల అరవ తేదీన కరీంనగర్‌కు చేరుకుంటానని వెల్లడించారు. డిప్యూటీ మేయర్ స్వరూపరాణి మేయర్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. బిసి మహిళ కావడంతోనే తనకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పలేదని అరోపించారు. ఈ క్రమంలో మేయర్ సునీల్ రావు అమెరికా నుండి ఒక వీడియో విడుదల చేశారు. మున్సిపాల్ చట్ట ప్రకారమే తాను వెళ్ళానని డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు తప్పుడు అరోపణలు చేస్తున్నారని తెలిపారు. మరోసారి స్వరూపరాణి సునీల్ రావు పైనా ఆరోపణలను చేస్తున్నారు. నాలుగున్నర ఏళ్ళుగా మున్సిపాలిటీ లో ఎం జరిగిందో తమ దగ్గర చిట్టా ఉందని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఇద్దరికి పదవులు ఇప్పించడంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపి వినోద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. మున్సిపాలిటీలో ఇంత రచ్చ జరుగుతున్నా వారు మాత్రం‌ మౌనంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా మేయర్ సునీల్ రావుకు, మాజీ ఎంపీ వినొద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ల‌ మధ్య గ్యాప్ పెరిగిందంట. ఈ క్రమంలోనే సునిల్ రావు పై ఆరోపణలు చేసిన వారు పెద్దగా పట్టించుకోవడం లేదట. బీఅర్ఎస్ అధిష్టానం స్వరూపరాణికి మద్దతు ఉండడంతోనే మేయర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

వారం రోజులలో కరీంనగర్ లో రాజకీయాలు వేగంగా మారుతాయని బీఅర్ఎస్ నేతల నుండి వస్తున్న మాట. మున్సిపాలిటీ గడువు కూడా ముగుస్తుండడంతో నేతలు కూడా అచితూచి వ్యవహారిస్తున్నారు. మేయర్ వ్యవహార శైలి పైనా వినొద్ కుమార్, గంగుల కమలాకర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ సునీల్ రావు ఈ మధ్య కాలంలో బీఅర్ఎస్ కార్యక్రమాలకు అంటిముట్టినట్లుగా వ్యవహారిస్తున్నారట. మొత్తానికి బీఅర్ఎస్ రాజకీయాలు ఎటువైపు మళ్లుతాయో వేచి చూడాల్సింది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే