Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన దొంగతనం.! దొంగపై పడ్డ ఫాస్ పుడ్ సెంటర్ డబ్బా..
చోరీ చేయబోయాడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ మధురానగర్‌లో ఆదివారం ఉదయం ఘటన జరిగింది. మధురానగర్‌లోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై నిలిపి ఉంచిన ఫాస్ట్ ఫుడ్ తోపుడు బండిపై ఓ దొంగ కన్నుపడింది. క్యాష్ కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రాడ్ తో ఫాస్ట్ ఫుడ్ బాక్స్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఒక స్లైడింగ్ డోర్ తెరుచుకుంది.
చోరీ చేయబోయాడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ మధురానగర్‌లో ఆదివారం ఉదయం ఘటన జరిగింది. మధురానగర్‌లోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై నిలిపి ఉంచిన ఫాస్ట్ ఫుడ్ తోపుడు బండిపై ఓ దొంగ కన్నుపడింది. క్యాష్ కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రాడ్ తో ఫాస్ట్ ఫుడ్ బాక్స్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఒక స్లైడింగ్ డోర్ తెరుచుకుంది. మరో డోర్ ఓపెన్ చేస్తుండగా .. ఒక్కసారిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డబ్బా మొత్తం అమాంతం అతనిపై మీద పడింది. ఆ బరువుకి అతను తీవ్రంగా గాయపడ్డాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంతో బరువున్న స్టీల్ డబ్బా ఒక్కసారిగా మీద పడింది. ఆ సమయంలో దగ్గర్లో ఎవరూ లేరు. దీంతో ఆ దొంగ బాధతో అల్లాడిపోయాడు. తెల్లవారుజాము కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయాన్నే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. దొంగ ఎవరు అతనిది ఏ ప్రాంతం వాసి అనేది దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ ఘటన.. సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.