Kolkata: నన్ను ఇరికించారు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్.!
కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ అధికారులు అతనిని కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సంజయ్ తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకు ముందు తానే హత్యాచారం..
కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ అధికారులు అతనిని కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సంజయ్ తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకు ముందు తానే హత్యాచారం చేశానని కావాలంటే ఉరి తీసుకోండని సంజయ్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిందితుడు మాట మార్చినట్లు తెలుస్తోంది.
కేసులో భాగంగా పాలీగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో.. అధికారులకు కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో జరిగిన విచారణ సమయంలో సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పాలీగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావ్? అని మేజిస్ట్రేట్ నిందితుడిని ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. తాను అమాయకుడిని. ఏ తప్పు చేయలేదు. కావాలనే తనను ఇందులో ఇరికించారని వాపోయినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందని సంజయ్‌రాయ్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.
కాగా.. సంఘటన జరిగిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా అధికారులు వీటికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సమయంలో నిందితుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడు. కాగా సెమినార్ హాల్‌లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫొటో ఆధారంగానే సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు, సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో లై డిటెక్టర్ పరీక్షకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.