Mosquitoes: ఇకపై దోమలను చంపేయండి ఈజీగా.. ఇలా.! ఆనంద్‌ మహీంద్ర ట్వీట్..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దాంతో దోమల బెడద కూడా ఎక్కువైంది. మరోవైపు సీజనల్‌ వ్యాధులు.. దోమలు కుట్టడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మన టెక్‌ దిగ్గజం ఓ దోమలను చంపే యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ ఇంట్లో ఫిరంగిని పోలి ఉన్న ఓ చిన్న యంత్రం అటూ ఇటూ తిరుగుతూ లేజర్‌ కిరణాలను ప్రసరింపచేస్తోంది.

Mosquitoes: ఇకపై దోమలను చంపేయండి ఈజీగా.. ఇలా.! ఆనంద్‌ మహీంద్ర ట్వీట్..

|

Updated on: Aug 28, 2024 | 3:19 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దాంతో దోమల బెడద కూడా ఎక్కువైంది. మరోవైపు సీజనల్‌ వ్యాధులు.. దోమలు కుట్టడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మన టెక్‌ దిగ్గజం ఓ దోమలను చంపే యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ ఇంట్లో ఫిరంగిని పోలి ఉన్న ఓ చిన్న యంత్రం అటూ ఇటూ తిరుగుతూ లేజర్‌ కిరణాలను ప్రసరింపచేస్తోంది. ఈ కిరణాల కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న దోమలన్నీ చనిపోతున్నాయి. దీనికి ఆనంద్‌ మహీంద్రా ‘ఇంటికి ఐరన్‌ డోమ్‌’ అని పేరుపెట్టారు.

వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది. ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us