కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారానికి కొన్ని గంటల ముందు జరిగింది ఇదే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనలో అసువులు బాసిన వైద్యురాలితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్ టెస్టులో వైద్యురాలి చివరి గంటల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనలో అసువులు బాసిన వైద్యురాలితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్ టెస్టులో వైద్యురాలి చివరి గంటల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. 31 ఏళ్ల బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత వైద్యురాలితో కలిసి ఘటన జరగడానికి ముందు డిన్నర్ చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి వాంగ్మూలాలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వైద్యురాలు హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత తొలుత చూసింది కూడా వీరే. సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడానికి వీరేమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని సీబీఐ భావిస్తోంది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన ఆసుపత్రి మూడో అంతస్తులోని సెమినార్ రూములో ఈ నలుగురిలో ఇద్దరి వేలిముద్రలను సీబీఐ గుర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పత్తి చేలో కలుపు తీస్తుండగా.. షాకింగ్ సీన్.. దెబ్బకు..
బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..
రంగుమారిన భీమిలి సముద్రం నీరు !! తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ??
లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్
N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

