AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యయ్యో..! ఎరక్కపోయి ఇరుక్కుపోయింది.. చివరకు..

వరంగల్‌లో DRF సిబ్బంది మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మారారు. సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో గేట్ గ్రిల్స్‌లో తల ఇరుక్కుపోయి గంటల పాటు తంటాలు పడుతున్న ఓ వీధి కుక్కను గుర్తించిన స్థానికులు DRF‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్‌ ...

Telangana: అయ్యయ్యో..! ఎరక్కపోయి ఇరుక్కుపోయింది.. చివరకు..
Stray Dog Rescue
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 11:47 AM

Share

ఎక్కడ విపత్తు జరిగినా అక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ వాలిపోతాయి. వానలైనా.. వరదలైనా.. భూకంపాలైనా.. వాళ్ల ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడమే DRF సిబ్బంది లక్ష్యం. అయితే ప్రజల ప్రాణాలు మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు కాపాడడం కూడా మా బాధ్యతే అంటున్నారు వరంగల్ డిఆర్ఎఫ్ టీం. ఎరక్కపోయి ఓ ఇంటి గేట్ గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన ఓ వీధి కుక్క ప్రాణాలను కాపాడడం కోసం DRF టీం రెండుగంటకు పైగా శ్రమించింది. ఎట్టకేలకు దానికి విముక్తి కల్పించారు. ఆ వీధి కుక్క ప్రాణాలు కాపాడి DRF టీంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం రామ‌చంద్రపురం గ్రామంలో జరిగింది.. ఓ వీధికుక్క ఇంటిముందున్న గేట్ గ్రిల్స్ నుంచి బయటకు దాటే క్రమంలో ఆ గ్రిల్స్‌లో దాని తల ఇరుక్కు పోయింది.. ముందుకు వెనక్కి ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో దాదాపు మూడు గంటలకు పైగా నరకం అనుభవించింది. ఆ కుక్క అరుపులు విని కాలనీ వాసులు బయటకు వచ్చారు.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో GWMC పరిధిలో పనిచేస్తున్న DRF టీమ్ నెంబర్‌కు ఫోన్ చేశారు.

ఈ క్రమంలో DRF సిబ్బంది వెంటనే స్పందించారు.. ప్రత్యేక వాహనంలో స్పాట్‌కు చేరుకున్న సిబ్బంది సుమారు మూడు గంటల పాటు శ్రమించారు.. కట్టర్‌తో గేట్ గ్రిల్స్ కట్ చేశారు. ఆ శునకాన్ని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.. అది చిన్న ప్రాణి.. మూగ జీవి.. పైగా వీధి కుక్కలతో మనుషుల ప్రాణాలకు ముప్పు.. అన్నీ తెలిసినా వృత్తి ధర్మాన్ని చాటి మానవత్వం ప్రదర్శించిన DRF టీమ్‌ను గ్రామస్తులు అభినందించారు.

Follow Us
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్