AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామయ్య సన్నిధిలో చక్కెర పొంగలి చోరులు.. దక్షిణ అయోధ్యలో మామూలు స్కామ్ కాదుగా..

భద్రాద్రి రామయ్య ఆలయంలో చక్కెర పొంగలి వివాదం నెలకొంది. 5కేజీలకు డబ్బులు చెల్లించి.. 32కేజీల చక్కెర పొంగలి తీసుకెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది తనిఖీల్లో బయటపడడం కలకలం రేపింది. చక్కెర పొంగలి అక్రమాన్ని క‌ప్పిపుచ్చేందుకు ఆల‌య అధికారులు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఆరాతీస్తున్నారు.

రామయ్య సన్నిధిలో చక్కెర పొంగలి చోరులు.. దక్షిణ అయోధ్యలో మామూలు స్కామ్ కాదుగా..
Bhadrachalam Temple
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2025 | 10:50 AM

Share

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయ ప్రసాద పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో చక్కెర పొంగలి అక్రమంగా తరలిస్తూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారనే హడావుడి జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన భక్తులు 5 కిలోల చక్కెర పొంగలి తయారు చేయించి తీసుకెళ్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. తూకం వేయడంతో 32 కిలోల బరువు వచ్చింది. అయితే.. సదరు భక్తులు తాము నిబంధనల ప్రకారం కిలోకి 400రూపాయల చొప్పున 2 వేలు చెల్లించామని చెప్పడంతో వారికి ఇబ్బంది కలుగకుండా అధికారుల ఆదేశాలతో వారిని పంపించారు. కానీ.. ఐదు కిలోలకు 32కిలోల చక్కెర పొంగలి ఎలా వచ్చిందనేది అయోమయానికి గురిచేసింది.

అలర్ట్‌ అయిన భద్రాద్రి ఆలయ ఈఓ దామోదరరావు మరోసారి భద్రతా సిబ్బంది సమక్షంలో ఐదు కిలోల చక్కెర పొంగలి తయారు చేసి తూకం వేయగా అది 36 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన పద్ధతి ప్రకారమే జరిగిందనే నిర్ణయానికి వచ్చారు ఆలయ అధికారులు.

ఇదిలావుంటే.. ఎక్కడైనా ఆల‌యాల్లో త‌యారైన ప్రసాదం ప్యాకెట్ల లెక్కన భ‌క్తుల‌కు అందిస్తుంటారు. కానీ.. భద్రాద్రి ఆలయంలో మాత్రం భ‌క్తులు ముందుగా ఆర్డర్ ఇస్తే త‌యారీ చేసి స‌ర‌ఫ‌రా చేస్తారు. ఇదే అదనుగా అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే.. చక్కెర పొంగలి అక్రమాన్ని క‌ప్పిపుచ్చేందుకు ఆల‌య అధికారులు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు
దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి