Warangal: భూకబ్జాకి పాల్పడిన కార్పొరేటర్ అరెస్ట్.. సంబరాలు చేసుకున్న బాధితులు..
అక్రమార్కులకు చెక్ పెడుతూ.. చిక్కలు చూపిస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్. భూ కబ్జాలకు పాల్పడి వారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటున్నారు.
అక్రమార్కులకు చెక్ పెడుతూ.. చిక్కలు చూపిస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్. భూ కబ్జాలకు పాల్పడి వారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటున్నారు. భూ కబ్జాలకు పాల్పడిన అధికార పార్టీ కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ ని సైతం అరెస్ట్ చేశారు. ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ లోని కాకతీయ కాలనీలో ఓ మహిళ భూమి కబ్జాకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హనుమకొండ పిస్ లో కేసు నమోదు చేశారు. భూ కబ్జాలకు పాల్పడ్డ కార్పోరేటర్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తో పాటు, అతని అనుచరుడి అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏమీ రంగనాథ్ చర్యలను ప్రజలు ప్రసంశిస్తున్నారు. బాధితుల పాలిట బాసటగా నిలుస్తున్న పోలీస్ శాఖను అంభినందిస్తున్నారు ప్రజలు.
సంబరాలు చేసుకున్న బాధితులు..
వరంగల్‌లో భూకబ్జాకి పాల్పడుతోన్న టీఆర్‌ఎస్ కార్పోరేటర్ అరెస్ట్‌తో బాధితులు సంబరాలు చేసుకున్నారు. హనుమకొండ లో కాకతీయ కాలనీలోని ఓ మహిళ భూమి కబ్జాకు ప్రయత్నించాడన్న ఆరోపణల నేపథ్యంలో అధికార పార్టీ కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హనుమకొండ చౌరస్తాలో టపాసులు కాల్చి, స్వీట్స్ పంచుకున్నారు బాధితులు. అధికార పార్టీ కార్పోరేటర్ ను కటకటాల్లోకి పంపిన వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ.వీ రంగనాథ్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ అరెస్టుని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..