Vikarabad Kalthi Kallu: కల్తీ కల్లు ప్రభావంతో మరొకరు బలి.. మూడుకు చేరిన మరణాల సంఖ్య

వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి వందల సంఖ్యలో జనం అస్వస్థతకు గురైన విషయం తెలసిందే. అయితే, బాధితుల్లో ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Vikarabad Kalthi Kallu:  కల్తీ కల్లు ప్రభావంతో మరొకరు బలి.. మూడుకు చేరిన మరణాల సంఖ్య
ప్రతీకాత్మక చిత్రం
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jan 18, 2021 | 10:25 PM

వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి వందల సంఖ్యలో జనం అస్వస్థతకు గురైన విషయం తెలసిందే. అయితే, బాధితుల్లో ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  తాజాగా కల్తీ కల్లు తాగిన ఓ మహిళ  సోమవారం మృతి చెందింది. ఈ నెల 7న చిట్టిగిద్ద కల్లు డిపోలో కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితురాలు..11 రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో ఆమె మరణించింది. దీంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య మూడుకు చేరింది.

వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లో కల్తీకల్లు తాగి 300 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రజల అస్వస్థతకు కారణమైన చిట్టిగిద్ద కల్లు డిపోను అధికారులు ఇప్పటికే సీజ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలను మూసివేశారు. కల్తీ కల్లు ఘటనకు గల కారణాలపై  పోలీసులతోపాటు, ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సదరు ప్రాంతాలలోని దుకాణాలలో విక్రయిస్తున్న కల్లులో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.  ఆల్ఫ్రా జోలం, డైజోఫామ్ డోసేజ్ వలనే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also Read :

Task Force Police Raids: టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు.. రూ.23 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

Mumbai Drugs: రూ.73 లక్షల నగదుతో పాటు డ్రగ్స్‌ పట్టివేత.. మహిళ అరెస్టు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు