బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు : ముందస్తు బెయిల్‌ కోసం భార్గవరామ్‌ పిటిషన్‌.. కోర్టుకు ఏమని విన్నవించాడంటే

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవరామ్ ముందస్తు బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించాడు. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న...

  • Ram Naramaneni
  • Publish Date - 9:48 pm, Mon, 18 January 21
బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు : ముందస్తు బెయిల్‌ కోసం భార్గవరామ్‌ పిటిషన్‌.. కోర్టుకు ఏమని విన్నవించాడంటే

Bowenpally kidnap case: బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవరామ్ ముందస్తు బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించాడు. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరాడు. కిడ్నాపులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నాడు. అఖిలప్రియ పేరును కూడా ఈ కేసులో అన్యాయంగా చేర్చారని.. ఏ-1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చి కేవలం నోటీసులు ఇచ్చి పంపారని పిటిషన్​లో విన్నవించాడు. వ్యాపారరీత్యా హైదరాబాద్​లో సెటిల్ అయ్యానని..పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సహకరిస్తానని పేర్కొన్నారు. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం లేకుండా సహరిస్తానని.. భార్గవ్ పిటిషన్​లో తెలిపాడు. భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్​పై బోయిన్​పల్లి పోలీసులకు నోటీసులు జారీ చేసిన సికింద్రాబాద్​ కోర్టు.. ఈ నెల 21వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

మరోవైపు బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను  సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు.  ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు పోలీసులు. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు పేర్కొంది. దీంతో బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో అఖిల ప్రియ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయనున్నారు.

Also Read:

Category 2 House: 24 రోజుల్లో తొలి ఇంటి నిర్మాణం.. ఏపీ ప్రభుత్వం కట్టించిన కొత్త ఇల్లుపై ఓ లుక్కేయండి

Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ