Hyderabad: ఎయిర్‌పోర్టులో కాస్త తేడాగా కనిపించిన మహిళలు.. చెక్ చేస్తే షాకింగ్ సీన్!

బ్యాంకాక్ నుండి వచ్చిన ఇద్దరు మహిళలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారి వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు కనిపించాయి.

Hyderabad: ఎయిర్‌పోర్టులో కాస్త తేడాగా కనిపించిన మహిళలు.. చెక్ చేస్తే షాకింగ్ సీన్!
Airport
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 26, 2024 | 11:32 AM

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విషపూరితమైన పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీ చేయడంతో వారి వద్ద విషపూరితమైన పాములు బయటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళలు ఎవరు? విషపూరిత పాములను ఎందుకు తరలిస్తున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచూ బంగారంతో సహా ఏవో ఒకటి పట్టు పడుతూనే ఉంటాయి. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తాజాగా విషపూరిత పాములను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబుల కలకలం సృష్టించాయి. నిరంతరం పటిష్ట బందోబస్తుతో ఉండే ఎయిర్‌పోర్టులో ఈ వరస ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తాజాగా బ్యాంకాక్ నుండి వచ్చిన ఇద్దరు మహిళలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారి వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు కనిపించాయి. దీంతో తనిఖీ చేయగా, రెండు అత్యంత అరుదైన విషపూరిత పాములు దర్శనమిచ్చాయి. ఆ పాములను చూసిన కస్టమ్స్ అధికారుల సైతం ఖంగుగుతిన్నారు. వివిధ రూపాల్లో బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న నిందితులను చూసిన కస్టమ్స్ అధికారులు, చెకింగ్ లో భాగంగా పాములను చూసి షాక్ అయ్యారు. బ్యాగులలో, లో దుస్తులలో నొప్పి చప్పుడు కాకుండా పాములను కూడా తీసుకురావడంతో ఎయిర్‌పోర్టు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!