Current Bill: ఖాళీగా ఉన్న ఇంటికి కరెంట్ బిల్లు.. వచ్చిన బిల్లుతో ఓ కారు కొనొచ్చు..!
ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? సాధారణంగా చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 5 వేలు వేసుకుందాం. కాదంటే ఇంకో 10 వేలు వేసుకుందాం. అదీ కరెంట్ వినియోగిస్తేనే. మరి ఖాళీగా ఉన్న ఇంటికి బిల్లు రావడం ఎప్పుడైనా చూశారా?
ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? సాధారణంగా చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 5 వేలు వేసుకుందాం. కాదంటే ఇంకో 10 వేలు వేసుకుందాం. అదీ కరెంట్ వినియోగిస్తేనే. మరి ఖాళీగా ఉన్న ఇంటికి బిల్లు రావడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. ఉప్పల్ ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 వచ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి యజమాని గుండె గుభేలుమంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టు కాలనీలో నివాసముంటున్న పాశం శ్రీదేవి ఇంటికి రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో కాలిగా ఉన్న పోర్షన్‌కి ప్రతి నెల రూ. 200 నుంచి 300 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. అయితే, మే నెలకి సంబందించిన కరెంట్ బిల్లు జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్‌లో చూడగానే వారికి గుండె ఆగినంత పనైంది. ఒక నెల బిల్లు ఏకంగా రూ. 7,97,576 బిల్లు వచ్చింది.
విద్యుత్ అధికారులని సంప్రదిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ, డిడి కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటు చేతులు దులిపేసుకున్నారు. మీటర్ మార్పిడి కోసం ఉప్పల్‌లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడా పట్టింపు లేనట్లుగా అధికారులు గంటల కొద్ది సమయాన్ని వృధా చేశారని శ్రీదేవి తల్లి అండాలు తెలిపారు. విద్యుత్ కార్యాలయం వద్ద ఇదే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు అని అండాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..