Telangana: ఇదెక్కడి గోల సామీ.. తుమ్మాడనే కారణంతో పొట్టు పొట్టుగా కొట్టారు.. అసలేం జరిగిందంటే..!

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తుమ్మాడనే కారణంతో ఓ వ్యక్తిని పొట్టు పొట్టుగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ఇదెక్కడి గోల సామీ.. తుమ్మాడనే కారణంతో పొట్టు పొట్టుగా కొట్టారు.. అసలేం జరిగిందంటే..!
Beating
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2023 | 1:48 PM

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తుమ్మాడనే కారణంతో ఓ వ్యక్తిని పొట్టు పొట్టుగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన బొందెల సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఈనెల 13వ తేదీన ఓ శుభకార్యానికి బయలుదేరారు. అయితే, అదే వీధిలో ఉంటున్న పప్పుల వీరభద్రం తన ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు. తుమ్ములు రావడంతో తుమ్మాడు. అయితే, అతను తుమ్మిన సమయంలోనే సత్యనారాయణ కారు ఇంటి ముందుకు వచ్చింది. దాంతో వీరభద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సత్యనారాయణ.

తాము కారులో వెళుతుండగా అపశకునంగా తుమ్మావని వీరభద్రాన్ని, సత్యనారాయణ కుటుంబీకులు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారంపై గ్రామంలో ఈనెల 15న పంచాయితీ నిర్వహించారు. ఈ సమయంలోనే సత్యనారాయణ కుటుంబీకులు ఒక్కసారిగా వీరభద్రంపై దాడిచేసి గాయపర్చారు. వీరభద్రం సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణతో పాటు అతని భార్య, ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, తుమ్మాడనే కారణంతో వ్యక్తిపై దాడి చేయడం ఇప్పుడు ఖమ్మంలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..