Telangana: సొంత పార్టీ నేతలపైనే బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సొంతపార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఆదివాసీ బిడ్డనైన తన ఎదుగుదలను చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్‌లు ఓర్వలేకపోతున్నారని అన్నారు. తాను ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడకపోయిన కూడా సొంతానికి వాడుకుంటున్నానని అసత్యాలు చెప్పారని ఆరోపించారు.
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సొంతపార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఆదివాసీ బిడ్డనైన తన ఎదుగుదలను చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్‌లు ఓర్వలేకపోతున్నారని అన్నారు. తాను ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడకపోయిన కూడా సొంతానికి వాడుకుంటున్నానని అసత్యాలు చెప్పారని ఆరోపించారు. తాను మాట్లాడింది వక్రీకరించి.. ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లిద్దరు కూడా తోడుదొంగలని మండిపడ్డారు. అయితే ఎంపీ ల్యాడ్స్ పనలకు సంబంధించి అవి కేవలం కలెక్టర్‌కు మాత్రమే పర్మిషన్ ఉంటుందని.. ఎవరు పడితే వారు ఇష్టరాజ్యంగా వినియోగించుకోవడానికి ఛాన్స్ ఉండదన్నారు.
ఆ నిధులను తాను సొంతానికి వాడినట్లు నిరుపిస్తే వెంటనే రాజీనామ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. గతంలో కూడా ఒకసారి తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఆ తర్వాత మరోసారి బీఆర్‌ఎస్ పార్టీలలోకి చేరుతున్నట్లు కూడా ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. వీరి చేష్టలు భరించలేక ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాసరెడ్డి బీజేపీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్పారు. పాయల్ శంకర్, రాఠోడ్ రమేష్‌లపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మళ్లీ ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..