Telangana: అందరిముందే నిలదీసిన కూతురు.. కుట్ర చేస్తున్నారంటూ విలపించిన ఎమ్మెల్యే..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్తి వివాదంలో కన్న కూతురే తనను ఇబ్బంది పెడుతుందంటూ కుమిలిపోయారు. తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్తి వివాదంలో కన్న కూతురే తనను ఇబ్బంది పెడుతుందంటూ కుమిలిపోయారు. తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన కూతురు మధ్య పంచాయతీ రాజకీయ వివాదంగా మారింది.
ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ముత్తిరెడ్డికి ఆయన కూతురు తుల్జా భవాన్ని ఎదురుపడ్డారు. అదే స్పాట్‌లో ఇద్దరిమధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీపై మరో కేసు పెట్టబోతున్నాను అంటూ ఎమ్మెల్యేకు బహిరంగంగా హెచ్చరించింది. ఓ డ్యాక్యూమెంట్ చూపించి ఈ సంతకం ఎవరు పెట్టారంటూ నిలదీసింది. దానికి తానే అని ఎమ్మెల్యే చెప్పడంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరో కేసు పెడతానంటూ హెచ్చరించింది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. కన్నీళ్ల పర్యంతమయ్యారు. గుండెలపై ఎత్తుకొని పెంచిన కూతురు ఇప్పుడు ఆస్థికోసం ఇబ్బంది పెడుతుందంటూ కన్నీటి విలపించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తనను ఎదుర్కొనే దమ్ములేని ప్రత్యర్థులు.. తన కూతురు, అల్లుడిని ట్రాప్ చేస్తున్నారంటూ మండిపడ్డారు ముత్తిరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..