Telangana: సోదరి స్నేహితురాల్ని బెదిరించి అత్యాచారం చేసిన యువకుడు

దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం ఎన్ని శిక్షలు విధించిన ఈ విషయంలో మార్పులు రావడం లేదు.

Telangana: సోదరి స్నేహితురాల్ని బెదిరించి అత్యాచారం చేసిన యువకుడు
Assault
Follow us
Aravind B

|

Updated on: Jun 20, 2023 | 12:15 PM

దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం ఎన్ని శిక్షలు విధించిన ఈ విషయంలో మార్పులు రావడం లేదు. తాజాగా మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఓ యవకుడు ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రమేష్‌(22) అనే యువకుడికి చెల్లె ఉంది. అయితే ఓసారి వాళ్ల ఇంటికి రమేష్ చెల్లె స్నేహితురాలు(14) వచ్చింది.

ఆ సమయంలో రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే తన సొదరి స్నేహితురాలని బెదిరించి అత్యాచారం చేశాడు. అలాగే పలుమార్లు ఆ బాలికపై రమేష్ అత్యాచారం చేశాడు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి చూపించారు. ఆ బాలిక ఐదు నెలల గర్భవతిగా వైద్యులు తేల్చారు. దీంతో ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..