Telangana: బీజేపీలోని కుట్రలు, నిధుల దుర్వినియగం ఏంటో నిగ్గు తేల్చాలి.. సోయం బాపురావు వ్యాఖ్యలపై స్పందించిన జోగు రామన్న
సొంత పార్టీ నేతలపైనే బీజీపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యా్ఖ్యలు తెలిసిందే. తన ఎదుగుదలను చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్‌లు ఓర్వలేకపోతున్నారని.. ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడకపోయిన కూడా తన సొంతానికి వాడుకుంటున్నానని అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు.
సొంత పార్టీ నేతలపైనే బీజీపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యా్ఖ్యలు తెలిసిందే. తన ఎదుగుదలను చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్‌లు ఓర్వలేకపోతున్నారని.. ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడకపోయిన కూడా తన సొంతానికి వాడుకుంటున్నానని అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు. అలాగే వీళ్లపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించారు. సోయం బాపురావు మాట్లాడిన విషయాలపై నిజనిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావే చెపుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ధర్మం కోసం అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతారని విమర్శించారు. ఎంపీనే స్వయంగా ఇంటి నిర్మాణం కోసం.. కొడుకు పెళ్లి కోసం ఎంపి ల్యాడ్స్ నిధులు వినియోగించుకున్నానని చెప్పారని.. మళ్లీ ఇప్పుడు నిధులు వాడుకోలేదని చెబుతున్నారని ఆరోపించారు. పార్టీలోని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారని తెలిపారు. అయితే ఆ కుట్రలు ఏంటో.. నిధుల దుర్వినియోగం ఏంటో బీజేపీ అదిష్ఠానమే తేల్చాలని డిమాండ్ చేశాడు. ఎంపీ ల్యాడ్స్ నిదులు దుర్వినియోగం చేసినట్టైతే శిక్ష తప్పదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..