ఐరాసలో శాశ్వత సభ్యదేశం కల నెరవేరేనా?

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పాటుపడుతున్న అంతర్జాతీయ సంస్థ. 193 దేశాలకు ఇందులో సభ్వత్వం ఉంది. ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా దక్షిణ సూడాన్ చివరిగా చేరింది. తైవాన్, వాటికన్ సిటీ, టోంగో, నౌరు తప్ప అన్ని దేశాలు ఐరాసలో ఉన్నాయి. ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తోంది భారత్. ఇందుకు తమ మద్దతు పలుకుతామని మిగతా దేశాలు చెబుతున్నా..చైనాతో పాటు..ఐరోపా దేశాలు అడ్డుకుంటూ వస్తున్నాయి. బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు […]

ఐరాసలో శాశ్వత సభ్యదేశం కల నెరవేరేనా?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 11, 2020 | 7:04 PM

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పాటుపడుతున్న అంతర్జాతీయ సంస్థ. 193 దేశాలకు ఇందులో సభ్వత్వం ఉంది. ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా దక్షిణ సూడాన్ చివరిగా చేరింది. తైవాన్, వాటికన్ సిటీ, టోంగో, నౌరు తప్ప అన్ని దేశాలు ఐరాసలో ఉన్నాయి. ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తోంది భారత్. ఇందుకు తమ మద్దతు పలుకుతామని మిగతా దేశాలు చెబుతున్నా..చైనాతో పాటు..ఐరోపా దేశాలు అడ్డుకుంటూ వస్తున్నాయి. బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు అందుకోసం పావులు కదుపుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవ పరిస్థితిని ఒక్కసారి అవలోకిద్దాం…

ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేస్తోందీ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలున్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్ లకు ఇందులో చోటుంది. ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్.

ఐరాసకు అడుగులు…

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలోనే 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యారు. వారి మధ్య కుదిరిన ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తర్వాతనే ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు కలిసి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేశారు. ఆ తర్వాత పలు దఫాలు చర్చలు జరిగాయి. చివరిగా 1945 క్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం ఐక్యరాజ్య సమితి చేస్తున్న పని. అంతే కాదు.. ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేలా చూడటం దీని కర్తవ్యం.

ఐరాస చేస్తుందంటే…

ఐరాసలో కీలక మైంది భద్రతా మండలి. ఈ సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 దేశాలు రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నికవుతాయి. వీటిని తాత్కాలిక సభ్య దేశాలంటాం. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సు లు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంది. ఏదైనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలంటే 5 శాశ్వత దేశాలు ఒప్పుకోవాలి. సమితిలోని 192 దేశాలు ఒప్పుకున్నా..శాశ్వత సభ్యత్వం ఉన్న ఒక్క దేశం ఒప్పుకోక పోతే ఆ తీర్మానం చెల్లదు.

భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నా..ఆ ఐదు దేశాలు ఒప్పుకోవాల్సిందే. అమెరికా, ఫ్యాన్స్, ఇంగ్లాండ్ లు ఒప్పుకున్నా..చైనా, రష్యాలు కొర్రి వేస్తున్నాయి. ఫలితంగా మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అందని ద్రాక్షలా ఊరిస్తోంది. భద్రతా మండలి ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ యూరప్ నుండి ఇద్దరు, తూర్పు యూరప్‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి నెలా మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య చేపట్టే అధికారముంది.

శాశ్వత సభ్యత్వం ఎండమావేనా…

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న దశాబ్దాల నాటి ప్రతిపాదనను నరేంద్ర మోదీ చాలా సార్లు ప్రస్తావించారు. వివిధ దేశాల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడకముందు, ఏర్పడిన తరువాత విశ్వశాంతి కోసం మనదేశం చేసిన, చేస్తున్న కృషి గుర్తించదగింది. విశ్వశాంతి కోసం దశాబ్దాల తరబడి కృషి చేస్తున్న మనదేశానికి మండలిలో శాశ్వత సభ్యత్వం లభించకపోవడం అన్యాయం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత ప్రతిపాదనను ఐరోపా దేశాలు పట్టించుకోవడం లేదు. మన దేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, సమితిలో వీటో-అధికారం లేకపోవడం చైనా, అమెరికా, ఐరోపా దేశాల వ్యూహంలో భాగం.

అమెరికా-చైనాలు బద్ద శత్రువులు. కానీ ఐక్యరాజ్య సమితిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించే అంశంలో ఏకమవుతున్నాయి. మనదేశాన్ని మండలిలో సమాన ప్రతిపత్తి ఉండడం వాటికి ఇష్టం లేదు. ఐరోపా దేశాలకు మన దేశానికి తమ ఎగుమతులను పెంచడం మాత్రమే లక్ష్యం. జర్మనీ కూడ మండలి శాశ్వత సభ్యతం కోసం యత్నిస్తోంది. మనదేశానికి శాశ్వత సభ్యత్వం లభించకపోవడానికి జపాన్, జర్మనీలు ఒక కారణం. భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే..అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు మిగతా దేశాల పై చేసే ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతోంది. ఇరాక్ పై దాడి చేసి..అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను హతమార్చేంత వరకు నిద్రపోలేదు అమెరికా సైన్యాలు. తాము అనుకున్నది సాధించే వరకు పంతం వీడలేదా దేశం. అదే కాదు..కొరియా, ఇరాన్, కువైట్, అరబ్ దేశాల్లోను అమెరికా తమ పెత్తనం సాగిస్తోంది. వియత్నాం, కెన్యా, రష్యా, క్యూబా వంటి దేశాలను అడ్డుకుంటోంది. భారత్ రంగంలోకి వస్తే తమ మాట వింటుందో లేదో అన్న అనుమానమే ఇందుకు కారణం. అదే జపాన్ దేశానికి సభ్యత్వం ఇస్తే..తమ మాట కచ్చతింగా వింటోందని బలంగా నమ్ముతోంది అమెరికా. అంతే కాదు..సరిహద్దు విషయంలో చైనాతో మనకు వివాదాలున్నాయి. డోక్లామ్, మణిపూర్ తో పాటు..భారత్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలను తమవిగా చూపుతోంది చైనా ఎర్రసైన్యం. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధంలో ఎర్ర సైన్యానికి ధీటుగా సమాధానమిచ్చింది భారత్. మరోసారి అదే పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశం పై తీవ్రమైన కసరత్తే చేస్తోంది కమ్యూనిస్టు దేశం.

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. చైనా తరువాత ఆ స్థాయిలో దూసుకు పోతున్న భారత్ కు ఐక్యరాజ్య సమితిలో చోటు దొరికితే..అమెరికానే కాదు.. చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటిదేశాల ఆగడాలకు అడ్డుకట్ట పడే వీలుంది. అందుకే అడ్డుకుంటున్నాయి. ప్రధాని మోదీ దౌత్య రాజకీయం చేస్తేనే ఫలితం ఉంటోంది. లేకపోతే సభ్యత్వం ఎండమావిలానే ఉంటుందన్నది నిజం.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.