AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sniper Rifle: రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైఫిల్‌ని చేతిలో పట్టుకుని టార్గెట్ ఎయిమ్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టార్గెట్ ఫిక్స్ చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగా ఆ ఫోటో కనిపిస్తుంది.

Sniper Rifle: రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
Cm Revanth Reddy
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 10:43 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి రైఫిల్‌ని చేతిలో పట్టుకుని టార్గెట్ ఎయిమ్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టార్గెట్ ఫిక్స్ చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టుగా ఆ ఫోటో కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో వెనుక ఒక స్టోరీ ఉంది. ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా డిసెంబర్ 6 శుక్రవారం రోజు హోం శాఖ పై సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో పోలీస్ శాఖ వినియోగిస్తున్న వివిధ రకాల గన్‌లు పిస్టల్స్ రైఫల్స్‌ని ప్రదర్శనకు ఉంచారు. వాటిని పరిశీలిస్తున్న సీఎం ఒక స్నైపర్ రైఫిల్‌ని చేతిలోకి తీసుకొని పరీక్షించి చూశారు. అక్కడున్న అధికారులు రైఫిల్ ప్రత్యేకతను సీఎం రేవంత్‌కు వివరించారు. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్‌ని ఎయిమ్ చేస్తే మిస్సవకుండా షూట్ చేయగల స్నైపర్ రైఫిల్ అది.. చుడ్డానికి చాలా ఆసక్తిగా ఉన్న ఆ రైఫిల్ గురించి సీఎం ఆరా తీయగా అది ఇజ్రాయిల్‌లో తయారైన స్నైపర్ రైఫిల్‌గా అధికారులు వివరించారు.

ఆ రైఫిల్ బరువు ఎనిమిదిన్నర కిలోలు.. 980 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గురి చేస్తే మిస్ అవ్వకుండా షూట్ చేయగలడం దాని ప్రత్యేకత. అయితే ఒక్కసారి మ్యాగజైన్ లోడ్ చేస్తే 18 రౌండ్లు ఫైర్ చేయొచ్చు.అయితే ఈ రైఫిల్‌తో పాటు జర్మనీ ,అమెరికా, మన భారత దేశంలో తయారైన వివిధ రకాల ప్రిస్టల్స్, గన్స్ సీఎం దగ్గరుండి పరిశీలించారు. కేవలం ఇది మాత్రమే కాదు హోమ్ డిపార్ట్మెంట్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బాంబ్ స్క్వాడ్, టెర్రరిస్ట్ స్క్వేర్, ఆర్మ్డ్ ఫోర్స్ ఇలా వివిధ శాఖల డెమో ప్రదర్శించారు. ఉగ్రవాదులు ఎటాక్ చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, నక్సల్స్ ఎటాక్‌ని ఎలా ఫేస్ చేస్తారు ఇలాంటి అంశాలను లైవ్‌లో పర్ఫమ్ చేసి  చూపించారు. ఈ ప్రదర్శనలు చూసిన సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద పెద్ద అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఏలాంటి ఎక్విప్మెంట్ వాడుతారు దాంతోపాటు ల్యాండ్ మైన్ డిటెక్టర్లు, అడవిలో సెర్చ్ ఆపరేషన్‌కి వెళ్ళినప్పుడు పోలీసులు వాడే అత్యాధునిక పరికరాలు, డ్రోన్స్ వీటన్నిటిని ప్రదర్శనలో చూపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి