Telangana: కౌన్ బనేగా సికింద్రాబాద్ కా సికిందర్.. ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి దూకుడు అందుకేనా..
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గత పదేళ్లలో అభివృద్ధి గురించి చెబుతూ, మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గత పదేళ్లలో అభివృద్ధి గురించి చెబుతూ, మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఇలా రోజుకో నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో రథయాత్ర నిర్వహించారు. వీధిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ, తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ఓపెన్ టాప్ జీప్‌లోఆయన ప్రచారం నిర్వహించారు.
గత పదేళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు కిషన్‌రెడ్డి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదేనన్నారు. ముస్లిం బిడ్డలకు మోదీ అండగా నిలిచి.. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని గుర్తు చేశారు. మోదీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని తెలిపారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంపై తీరుపై విరుచుకుపడ్డారు కిషన్‌రెడ్డి. ఆ మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తునే.. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌పై ఫోకస్ పెట్టారు కిషన్‌రెడ్డి. ఉదయం నుంచి రాత్రివరకూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం సికింద్రాబాద్. ఇప్పటి వరకు అయిదుసార్లు బీజేపీకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. గతంలో బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయనను ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. క్రియాశీలక రాజకీయాల నుంచి బండారు దత్తాత్రేయ తప్పుకొన్నాక.. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్నారు. కిషన్ రెడ్డికి కూడా రెండు సార్లు పట్టంగట్టారు ఈ నియోజకవర్గ ప్రజలు. ముచ్చటగా మూడో సారి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు కిషన్ రెడ్డి. ఇక ఇదే క్రమంలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్కు పార్లమెంట్ విజయంతో జోష్ నింపేందుకు సిద్దమయ్యారు. పద్మారావు గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిని అనుభవం ఉంది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పద్మారావు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో దిగుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పకతప్పదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




