AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీస్మార్ ఖాన్..! బట్టబుర్ర మీద విగ్గు పెట్టుకొని దర్జాగా దొంగతనాలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

అతని వద్ద సుమారు రూ.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. పదుల సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను క్రైమ్ బ్రాంచ్ సేకరించింది. అన్నింటిలోనూ అతడు తలపై నకిలీ వెంట్రుకలతో విగ్గు ధరించినట్లు తేలింది. చోరీ చేసిన బంగారు వస్తువులను విక్రయించేవాడని చెప్పారు. అలా ఎంత బంగారం అమ్మేశాడు, ఎక్కడ విక్రయించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

తీస్మార్ ఖాన్..! బట్టబుర్ర మీద విగ్గు పెట్టుకొని దర్జాగా దొంగతనాలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Bald Thief
Jyothi Gadda
|

Updated on: Apr 11, 2024 | 9:09 AM

Share

ఓ బట్టతల దొంగ నకిలీ జుట్టు ధరించి దొంగతనాలు చేయటం పనిగా పెట్టుకున్నాడు. నకిలీ జుట్టుతో చోరీలు చేస్తూ ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకు తిరగేవాడు. అలా వందలు, వేలు కాదు.. ఏకంగా రూ.62 లక్షలు దోచుకున్నాడు. లూటీ అనంతరం అతడు విమానంలో ప్రయాణించి స్వగ్రామానికి వెళ్లేవాడు. ఈ ఘరానా దొంగ ఇలా మారువేశంలో వెళ్లి పలు ప్రాంతాల్లో 22 చోరీలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని థానే క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అస్సాంకు చెందిన వేషాలు మార్చే ఈ దొంగను పట్టుకున్నారు. ఈ దొంగ బట్టతల కారణంగా ఫేక్ హెయిర్ వేసుకుని దొంగతనం చేసేవాడని, చోరీకి పాల్పడిన తర్వాత విమానంలో ఇంటికి వెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. విలువైన నగలు, నగదు మొత్తం రూ.62లక్షలు నిందితుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, ..ముంబై, నవీ ముంబై, థానేలోని పలు ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఈ దొంగను మొయినుల్ అబ్దుల్ మాలిక్ ఇస్లామ్‌గా గుర్తించారు. ఇతను అస్సాం వాసి అని తేలింది. రూ. 62 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించాడు. నిందితుడు ఇప్పటివరకు థానే జిల్లాలో 19, నవీ ముంబైలో 2, ముంబైలో 1 మొత్తం 22 భారీ చోరీలకు పాల్పడ్డాడు. ఈ నిందితుడి తలపై వెంట్రుకలు లేవు, అతను బట్టతలతో ఉన్నాడు. దొంగతనానికి పాల్పడే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అతడు నకిలీ వెంట్రుకలతో విగ్గు వేసుకునేవాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి
Bald Thief Wears Fake Hair

ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ డీసీపీ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ, నకిలీ విగ్ ముసుగులో తనను ఎవరూ గుర్తించకుండా ఈ నిందితుడు అసోంలోని హోజాయ్ జిల్లా నుండి విమానంలో థానే చేరుకుంటాడని చెప్పారు. ఇక్కడ అద్దెకు ఇల్లు తీసుకున్నాడని చెప్పారు. చోరీకి పాల్పడే ఇళ్లకు సంబంధించిన వివరాలను ముందుగానే సేకరించి పెట్టుకుంటాడని చెప్పారు. చోరీ చేసిన తర్వాత విమానంలో స్వగ్రామానికి వెళ్లేవాడు. ఈ సమయంలో అతను తన ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసేవాడని చెప్పారు. పక్క ప్రణాళికతో ఎట్టకేలకు దొంగను పట్టుకున్నామని చెప్పారు. అతని వద్ద సుమారు రూ.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. పదుల సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను క్రైమ్ బ్రాంచ్ సేకరించింది. అన్నింటిలోనూ అతడు తలపై నకిలీ వెంట్రుకలతో విగ్గు ధరించినట్లు తేలింది. చోరీ చేసిన బంగారు వస్తువులను విక్రయించేవాడని చెప్పారు. అలా ఎంత బంగారం అమ్మేశాడు, ఎక్కడ విక్రయించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..