AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating App: నైస్‌గా చాట్ చేస్తే ఐస్ అయిపోయాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!

డేటింగ్ యాప్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలియదు కానీ.. అంతకంటే ఎక్కువగా నష్టాలే ఉంటాయి. సైబర్ నేరగాళ్లు, గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ లక్షలు దోచేస్తున్నారు. డేటింగ్ యాప్ వల్ల మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. చాలామంది కేటుగాళ్ల స్కెచ్ కు బలవుతున్నారు.

Dating App: నైస్‌గా చాట్ చేస్తే ఐస్ అయిపోయాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!
Dating
Balu Jajala
|

Updated on: Apr 11, 2024 | 8:49 AM

Share

డేటింగ్ యాప్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలియదు కానీ.. అంతకంటే ఎక్కువగా నష్టాలే ఉంటాయి. సైబర్ నేరగాళ్లు, గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ లక్షలు దోచేస్తున్నారు. డేటింగ్ యాప్ వల్ల మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. చాలామంది కేటుగాళ్ల స్కెచ్ కు బలవుతున్నారు. తాజాగా సూరత్‌లోని అమ్రోలి ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని చిత్రహింసలకు గురిచేసి లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి అమ్రోలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఓ 36 ఏళ్ల యువకుడి డేటింగ్ యాప్ లో యాక్టివ్ గా ఉంటాడు. బ్లూ లైవ్ యాప్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ యువకుడు వెంటనే ఒకే చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యువకుడు అంగీకరించడంతో ఆన్‌లైన్ చాటింగ్ ప్రారంభమైంది. దీని తర్వాత స్వలింగ సంపర్కం కోసం ఆ యువకుడిని ప్రలోభపెట్టి అమ్రోలి ప్రాంతానికి పిలిచారు. ఓ ఇంటికి పిలిచి యువకుడి నగ్నంగా వీడియోలు తీశారు. యువకుడిని గదిలోకి ఎంటర్ అయ్యేటప్పటికే పరిస్థితి బాగా లేదు. నగ్న వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించారు. యువకుడి నుంచి నలుగురు వ్యక్తులు రూ.7.50 లక్షలు డిమాండ్ చేశారు.

యువకుడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో రెండు రోజులు టైం కావాలని అడగడంతో ఒకే చెప్పారు. ఆ తర్వాత రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే నిందితులు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువకుడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే అమ్రోలి పోలీసులు మైనర్ సహా నలుగురు నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. అరెస్టయిన నిందితుల్లో సురేష్ సఖియా, మనోజ్ చౌహాన్, అంకిత్ త్యాగి, మైనర్ నిందితులు ఉన్నారు. సోషల్ మీడియా యాప్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అస్సలు యాక్సెప్ట్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే