Glass Bridge: శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ‘గ్లాస్ బ్రిడ్జ్’.. పర్యాటకుల కోసం సిద్ధంగా ఉంది..! ఎక్కడో తెలుసా..?
రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ గ్లాస్ స్కై వాక్ వంతెనను నిర్మించారు. ఈ గాజు వంతెన 40 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. విల్లు, బాణం ఆకారంలో నిర్మించిన ఈ వంతెన పొడవు 25 మీటర్లు కాగా, రెండు స్తంభాల విల్లుల మధ్య వెడల్పు 35 మీటర్లు. వంతెన లోడ్ సామర్థ్యం చదరపు మీటరుకు 500 కిలోలు అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రజలు ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు వారు అద్భుతాన్ని చూస్తారు.. వంతెన కిందగా..
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నిర్మించిన గాజు వంతెన ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆ గాజు వంతెనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతన్నాయి. ఇప్పుడు యూపీలో కూడా అలాంటి గాజు వంతెన పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా నిర్మించిన మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెన ఇది. దీనిని చిత్రకూట్‌లోని తులసి (శబరి) జలపాతం వద్ద సిద్ధంగా ఉంది. అయితే, బీహార్‌లో నిర్మించిన గాజు వంతెన, యూపీలోని శబరి జలపాతంపై నిర్మించిన గాజు వంతెనకు ఎంత తేడా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.? యూపీలోని ఈ గ్లాస్ స్కై వాక్ వంతెన విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
యూపీలో మొట్టమొదటి గ్లాస్ స్కై వాక్ వంతెన పర్యాటకుల కోసం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ గాజు వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ.3.70 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిసింది. ఈ వంతెన చుట్టూ హెర్బల్ గార్డెన్స్ మరియు రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఎకో టూరిజంలో పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారనుందని చెబుతున్నారు. దీనిని నిర్మించిన జలపాతాన్ని శబరి జలపాతం అని పిలుస్తారు. అయితే, ఆ తరువాత దాని పేరు తులసి జలపాతంగా మార్చబడిందని సమాచారం.
కోదండ అడవుల్లో ఉన్న ఈ జలపాతంపై రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ గ్లాస్ స్కై వాక్ వంతెనను నిర్మించారు. ఈ గాజు వంతెన 40 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. విల్లు, బాణం ఆకారంలో నిర్మించిన ఈ వంతెన పొడవు 25 మీటర్లు కాగా, రెండు స్తంభాల విల్లుల మధ్య వెడల్పు 35 మీటర్లు. వంతెన లోడ్ సామర్థ్యం చదరపు మీటరుకు 500 కిలోలు అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రజలు ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు వారు అద్భుతాన్ని చూస్తారు.. వంతెన కిందిబాగాన కనిపించే దట్టమైన అడవి, రాళ్లు, గుట్టలపై నుండి పడే జలపాతం అందాలను వీక్షిస్తారు.
రాజ్‌గిర్‌లోని గ్లాస్ బ్రిడ్జ్‌పై నడుస్తున్నప్పుడు, పాదాల కింద నేల లేనట్లుగా అనిపిస్తుంది. ఈ వంతెన చైనాలోని హాంగ్‌జౌ తరహాలో నిర్మించబడింది. దీని ఎత్తు 200 అడుగులు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వంతెన కంటే రెండింతలు ఎక్కువ.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..