Ramdev Baba: ఇంకెప్పుడూ ఇలా చేయను.. క్షమించండి
తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.
తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం పతంజలి ఆయుర్వేదకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1 కోటి జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషిన్‌లో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆ తరువాత కూడా ప్రకటనలు కొనసాగడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. గతంలో ఇచ్చిన తీర్పును అమలు పరచనందుకు వారిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anjali: ఉగాది పచ్చడి తిన్నాకే ఏ పనైనా..
విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం
సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??
అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో
అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం