BJP: తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలిః కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసినా మంచి ఫలితాలను బీజేపీ సాధించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ఐదే ఐదు నెలల్లో 14శాతం నుంచి 35శాతానికి ఓట్‌ షేర్‌ను పెంచుకున్నట్టు చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకీ ఈ స్థాయిలో ఓటు శాతం పెరగలేదన్నారు కిషన్‌రెడ్డి.

BJP: తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలిః కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 12, 2024 | 3:14 PM

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అసాధారణ విజయం సాధించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జి కిషన్‌రెడ్డి అన్నారు. 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతోపాటు 35శాతం ఓటు బ్యాంక్‌ సాధించినట్టు చెప్పారు. 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఫస్ట్‌ప్లేస్‌లో నిలవగా, 44చోట్ల రెండోస్థానంలో ఉందన్నారు. పదేళ్లు అధికారం ఉన్న బీఆర్‌ఎస్‌ మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఫస్ట్‌ప్లేస్‌లో ఉందన్నారు. కాంగ్రెస్‌ అయితే ఐదు నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు కిషన్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రసాదన్, బండి సంజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గం, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసినా మంచి ఫలితాలను బీజేపీ సాధించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ఐదే ఐదు నెలల్లో 14శాతం నుంచి 35శాతానికి ఓట్‌ షేర్‌ను పెంచుకున్నట్టు చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకీ ఈ స్థాయిలో ఓటు శాతం పెరగలేదన్నారు కిషన్‌రెడ్డి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకోవాలన్నారు.

ఇక పార్టీ ఫిరాయింపులపై ఆనాడు బీఆర్‌ఎస్‌ చేసిందే.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందన్నారు కిషన్‌రెడ్డి. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే అన్న కిషన్ రెడ్డి, దొందూ దొందే అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యువకులు మహిళలు ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారా అన్నారు. దేశంలో పేద ప్రజల సంక్షేమం నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీతోనే సాధ్యమైందన్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..