AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: బీజేపీలోకి రావాలంటే.. రాజీనామా చేయాల్సిందే.. ఈడీ కేసులుంటే పార్టీలోకి రారుః బండి సంజయ్

బీజేపీలో చేరాలంటే పార్టీ నియమాలు పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరాలన్నారు బండి సంజయ్.

Bandi Sanjay: బీజేపీలోకి రావాలంటే.. రాజీనామా చేయాల్సిందే.. ఈడీ కేసులుంటే పార్టీలోకి రారుః బండి సంజయ్
Bandi Sanjay Kumar
Balaraju Goud
|

Updated on: Jul 07, 2024 | 7:31 PM

Share

బీజేపీలో చేరాలంటే పార్టీ నియమాలు పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరాలన్నారు బండి సంజయ్. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ కింద అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య రైల్వే లేన్ సాధ్యాసాధ్యాలపై సర్వే పనులు పూర్తి అయ్యాయన్నారు.

కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మీడియా ఇష్టాగోష్టిలో బండి సంజయ్ ముచ్చటించారు. గత కేసీఆర్ సర్కార్ విభజన చట్టంలోని పలు అంశాలను గాలికి వదిలేసిందన్నారు. పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం మరింత జఠిలం చేశారన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశముంది. మరోవైపు ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా? అని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బండి సంజయ్ సూచించారు.

ఈడీ, సీబీఐ సంస్థల విచారణలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈడీ కేసులున్న వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలను బీజేపీలోకి చేర్చుకునే అవకాశం లేదన్నారు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ పేరుతో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు… ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదన్నారు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే, కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..