AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medi Kallu: ఇదేం విచింత్రం సామీ..! మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం..!

మనం తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూర కల్లు చూశాం. కానీ మేడిచెట్టు కల్లు ఎప్పుడైనా చూశారా.. అసలు విన్నారా..? మేడి చెట్టు గురించి మనం విన్నదీ.. మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చదువుకున్న వేమన పద్యం గుర్తుంది కానీ, మేడిచెట్టు చూడు తాటి చెట్టు మాదిరై ఉండదు

Medi Kallu: ఇదేం విచింత్రం సామీ..! మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం..!
Medi Kallu
Boorugu Shiva Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 07, 2024 | 6:58 PM

Share

మనం తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూర కల్లు చూశాం. కానీ మేడిచెట్టు కల్లు ఎప్పుడైనా చూశారా.. అసలు విన్నారా..? మేడి చెట్టు గురించి మనం విన్నదీ.. మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చదువుకున్న వేమన పద్యం గుర్తుంది కానీ, మేడిచెట్టు చూడు తాటి చెట్టు మాదిరై ఉండదు. కానీ కాండానికి కోత పెట్టి చూడు కల్లు పారును అన్నది ఈ కాలం నాటి పద్యం. అవును మీరు చదువుతోంది నిజమే..! మేడిచెట్టు నుండి కల్లు వస్తోంది.. ఆ కల్లు ఇప్పుడు అక్కడ దివ్యాషధంలా మారిపోయింది..!

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే నరేందర్ తన ఇంటి దగ్గర మేడిచెట్టు నుంచి నురగతో కొబ్బరి నీళ్ల లాంటి కల్లు పదార్థం బయటకు వస్తోంది. ఇది గమనించిన గీత కార్మికుడు శివగౌడ్ మేడిచెట్టుకు కల్లు గీయడం ప్రారంభించారు. చెట్టుకు కల్లు గీసిన మొదట్లో ప్రతిరోజు రెండు బిందెల కల్లు వచ్చేది. ప్రస్తుతం ఉదయం పది లీటర్లు, సాయంత్రం పది లీటర్ల కల్లు వస్తుంది. అయితే ఈ మేడి కల్లు ఏంటి అని మొదట్లో అశ్చర్యంగా చూసిన జనం అది తాగిన తర్వాత సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు. ఇంకేముంది మేడికల్లును ఇష్టంగా తాగుతున్నారు గ్రామస్థులు.

ఈతచెట్టుకు తాటిచెట్టుకు కల్లు రావడం సహజం కానీ మేడిచెట్టుకు కల్లు ధారలుగా రావటంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ మేడి కల్లు ఆరోగ్యానికి మంచిదని అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు స్థానికులు. కాళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారికి, నరాల బలహీనత ఉన్నవారు ఈ కల్లు తాగిన తర్వాత తమకు ఆరోగ్యం బాగుంది అంటున్నారు. ఇంకేముంది ఆనోటా ఈనోటా పక్కన ఊర్లకు పాకింది ఈ మేడికల్లు ముచ్చట. ఇప్పుడు చిన్నకొత్తపల్లి గ్రామం మేడికల్లు కు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. చుట్టూ పక్కన గ్రామస్థులు ఈ మేడికల్లు కోసం ఎగబడుతున్నారు. బాటిల్స్‌లో కల్లును కొనుక్కొని తీసుకెళ్తున్నారు. దీంతో మేడికల్లుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక లీటర్ మేడిచెట్టు కల్లును రూ.50 లకు విక్రయిస్తున్నారు. ఇక రోజు లీటర్లకు లీటర్లు మేడిచెట్టు కల్లు అమ్మకాలు స్థానికులు ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

వీడియో చూడండి… మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..