Amit Shah Tour: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. వెయ్యి ఊడల మర్రి సాక్షిగా భారీ బహిరంగసభ..!
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు ప్రకటించారు.
Amit Shah Telangana Tour: తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద భారతీయ జనతా పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు ఆయన హాజరు అవుతారని తెలిపారు.
తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే… ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఆనాటి రజాకార్లు మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అదే వెయ్యి ఊడల మర్రి చెట్టు వద్ద బీజేపీ భారీ సభకు ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.
కాగా, గత పదకొండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సెప్టెంబర్ 17నాటికి ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్‌కు చేరుకునేలా నేతలు ప్లాన్ చేశారు. అదే రోజు పాదయాత్రతో పాటు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొనున్న అమిత్ షా విమోచన దినోత్సవం సందర్భంగా రాజకీయంగా కీలక ప్రకటన ఏదైనా చేస్తారా అనే చర్చ అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.
మరోవైపు, వచ్చే ఎన్నికల నాటికీ తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు పాదయాత్రలతో పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రను చేపట్టగా.. మరోవైపు, బండి సంజయ్ కూడా పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర హోం మంత్రి సైతం పర్యటన కు రావడం బీజేపికి మరింత ఊపునివ్వనుంది. త్వరలో హుజూరాబాద్‌లో జరుగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో అమిత్ షా పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Vinayaka Chavathi: వినాయక చవితి వేళ విషాదం.. ప్రాణం తీసిన తామర పూలు.. భార్య చూస్తుండగానే భర్త మృతి!