Vinayaka Chavathi: వినాయక చవితి వేళ విషాదం.. ప్రాణం తీసిన తామర పూలు.. భార్య చూస్తుండగానే భర్త మృతి!
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి కోసం తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యవాత పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలో చోటుచేసుకుంది.
Man died in pond: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి కోసం తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యవాత పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలో చోటుచేసుకుంది. మృతదేహన్ని వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుల్కచర్ల మండల కేంద్రంలో పండ్లు, పువ్వుల వ్యాపారం చేసే వెంకటరాములు, బాలమ్మ దంపతులు వినాయక చవితి వేడుకగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గణేష్ తొలిరోజు పూజ కోసం తామర పువ్వుల వేటలో పడ్డారు. ఈ క్రమంలో మోత్కూర్ గ్రామంలోని నీటి కుంటలో తామర పువ్వులు గమనించిన వెంకటరాములు(55) వాటిని తెంపేందుకు కుంటలోకి దిగాడు. నీటిలోకి దిగిన వెంకటరాములు బురదలో కూరుక్కుపోయాడు. ఎంతకి నీటిలోంచి బయటకు రాకపోవడంతో అతని భార్య బాలమ్మ కేకలు పెడుతూ రోధిస్తుండటంతో.. అది గమనించిన స్థానికులు విషయం ఆరా తీసి పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నాచులో ఇరుక్కుపోయిన వెంకటరాములు మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్వకోల్ గ్రామానికి చెందినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతుడు భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.