మిషన్ భగీరథ పథకంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. వంద శాతం నల్లా కనెక్షన్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు సీఎం కేసీఆర్ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రశంసింది.

మిషన్ భగీరథ పథకంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. వంద శాతం నల్లా కనెక్షన్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ
Follow us

|

Updated on: Jan 21, 2021 | 5:39 PM

Household tap connections : తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కేంద్రం కితాబునిచ్చింది. తెలంగాణలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు సీఎం కేసీఆర్ సర్కార్‌ను ప్రశంసింది. ఇందులో భాగంగా వంద శాతం ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇప్పటివరకు వంద శాతం ఎఫ్‌హెచ్‌టిసి పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం గోవా. రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు.

ఇంటింటికీ నల్లా నీరందించడంలో తెలంగాణ వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ లాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నట్లు గతంలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 54,06,070 గృహలకు మిషన్ భగీరథ పథకం కింద నల్లా కనెక్షన్ ద్వారా నీటి సరఫరా అవుతోంది. భారతదేశ గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు ఉండేలా చూడడానికి మేము దగ్గరగా ఉన్నామన్న కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హర్ ఘర్ జల్ అనే మా ఆలోచన త్వరలోనే నిజమవుతుందన్న ధీమాతో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకోసం కృషీ చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అభినందనలు తెలిపారు.

అయితే, ఇంటింటికీ నల్లా నీరందించడంలో గోవా రాష్ట్రం వంద శాతంతో దేశంలోనే ముందుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ డిసెంబరు నెలాఖరు నాటికి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంటింటికీ నల్లా నీరందించడంలో జాతీయ సగటు 32.54గా ఉంది.