తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ.. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు..?

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. సొంత పార్టీ నేతలు కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:14 pm, Thu, 21 January 21
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ.. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు..?

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కేటీఆర్.. త్వరలోనే కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం.. ఇందుకోసం ముహుర్తం కూడా ఖరారు అయ్యింది.. ఇంతకీ కేటీఆర్ ఎప్పడు సీఎం అవుతాడు..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది. సొంత పార్టీ నేతలు కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి మంత్రి కేటీఆర్ అన్నివిధాల సమర్థుడు అంటూ చెబుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎంగా కేటీఆర్‌కు జైకొడుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని ఓ మంత్రి.. ఆయన సీఎం అయితే ఆయన వెంటే మేమంతా ఉంటామంటూ మరో మంత్రి సమర్థించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఒకడుగు ముందుకేసి కాబోయే సీఎంకి అభినందనలు అంటూ సభాముఖంగా బహిరంగంగానే ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు కనిపిస్తోంది.

అంతేకాదు, ఇప్పటికే కేటీఆర్ సీఎం కానున్నట్లు ఇందుకు ముహుర్తం కూడా ఖరారు అయ్యినట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలోనే కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర పాలనపై క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగా కేటీఆర్ ఉన్నప్పటికీ.. తెర వెనుక మొత్తం వ్యవహరంలో కేసీఆర్ మార్క్ ఉంటుందంటున్నారు. రాష్ట్రాభివృద్ధిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వలన్న సంకల్పంతో ముఖ్యమంత్రిగా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే.. కేటీఆర్‌ సీఎం కాబోతున్నాడంటూ… వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని.. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో “ఆస్క్‌ మీ వాటేవర్‌ యూ ఫీల్‌ లైక్‌” అనే ట్యాగ్‌ లైన్‌తో నెటిజెన్లతో ముచ్చిటించారు హిమాన్షు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. కేటీఆర్‌, కేసీఆర్‌ లాగే రాజకీయాల్లోకి వస్తారా.. అని ఒకరు అడగ్గా.. తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్‌ లేదని చెప్పుకొచ్చాడు హిమాన్షు.

ఇదీ చదవండి… మిషన్ భగీరథ పథకంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. వంద శాతం నల్లా కనెక్షన్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ