Subbirami Reddy: మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌.. ఓ కంపెనీ రూ.11 కోట్ల మోసం..!

Subbirami Reddy: ఏపీ రాష్ట్ర సీనియర్‌ నేత, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డికి అనుకోని షాగిలింది. సుబ్బిరామిరెడ్డికి ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ..

Subbirami Reddy: మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌.. ఓ కంపెనీ రూ.11 కోట్ల మోసం..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2021 | 7:05 AM

Subbirami Reddy: ఏపీ రాష్ట్ర సీనియర్‌ నేత, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డికి అనుకోని షాగిలింది. సుబ్బిరామిరెడ్డికి ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసగించింది. ఏకంగా రూ.11 కోట్ల విలువ చేసే షేర్ల విషయంలో మోసం చేసింది ఆ కంపెనీ. ఓ కంపెనీ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆయన కుటుంబానికి తెలియకుండానే ముంబైకి చెందిన కంపెనీ షేర్‌లను అమ్మేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సబ్బిరామిరెడ్డి.. ఛాంపియన్‌ పిన్స్‌ లిమిటెడ్‌కు చెందిన చేతన్‌ బాలుబాయి పటేల్‌ (48), హర్షవర్ధన్‌ అవినాష్‌ ప్రధాన్‌ (40) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. వీరిద్దరిని జ్యూడీషియల్‌ కస్టడికి తరలించారు. అయితే సుబ్బరామిరెడ్డి కుటుంబానికి రూ. 11 కోట్ల నష్టం వాటిల్లింది.

కాగా, జూలై 20న హైదరాబాద్‌లోని గాయత్రి ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ (జీపీఎల్‌) ప్రమోటర్‌, చైర్‌పర్సన్‌ శ్రీమతిరెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. అయితే వాళ్లను నమ్మి దాదాపు రూ.33.05 కోట్ల విలువ చేసే షేర్లపై రూ.11,50,63,575 రుణం తీసుకునేందుకు అంగీకరించారు. రుణం పొందడానికి చివరికి జీపీఎల్‌ జూన్‌ 17న మాస్టర్‌ లోన్‌ అగ్రిమెంట్‌ ప్రకారం సీఎఫ్‌ఎల్‌తో కేవలం 32,50,000 షేర్లను మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లకు రుణ మొత్తాన్ని జూలై 12లోగా జీపీఎల్‌కు బదిలీ చేయాల్సి ఉంది. కానీ సీఎఫ్‌ఎల్‌ లోన్‌ మొత్తంలో ఎలాంటి డబ్బు జీపీఎల్‌కు బదిలీ చేయలేదు. జూలై 8న సీఎఫ్‌ఎల్‌ తాకట్టు పెట్టిన షేర్లను చట్టవిరుద్దంగా ప్రవేశపెట్టిన బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్లు తేలింది. తమకు మోసగించిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సుబ్బిరామిరెడ్డి భార్య పోలీసులను అభ్యర్థించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 406, 420R/W కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

PM Kisan: దుర్వినియోగం అవుతున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌.. ఇక్కడ అనర్హులకే బెనిఫిట్‌.. అధికారుల విచారణ

PPF Accounts Merger: ఇక నుంచి ఒకే పీపీఎఫ్‌ ఖాతా.. అకౌంట్ల విలీనంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే