Khammam: విషాదం.. చిన్నారులు ఆడుకుంటుండగా కూలిన భారీ వృక్షం.. ఇద్దరు మృతి
Childrens died with tree fall: ఖమ్మంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిల్లలు ఆడుకుంటుండగా భారీ వృక్షం నేల కూలింది. దీంతో ఇద్దరు
Childrens died with tree fall: ఖమ్మంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిల్లలు ఆడుకుంటుండగా భారీ వృక్షం నేల కూలింది. దీంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన ఖమ్మం (Khammam) నగరంలోని బ్రాహ్మణ బజార్‌లో చోటుచేసుకుంది. సెలవులు కావడంతో బ్రాహ్మణ బజార్‌కు చెందిన ఆరుగురు చిన్నారులు మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు అక్కడున్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. ఈ క్రమంలో చిన్నారులంతా (Childrens) సరదాగా ఆడుకుంటుండగా భారీ చెట్టు ఒక్కసారిగా అక్కడున్న గోడపై పడింది. దీంతో గోడ పక్కనున్న చిన్నారులపై కూలింది. ఈ క్రమంలో గోడ కింద పడి దిగాంత్ శెట్టి (11), రాజ్‌పుత్ ఆయుష్ (6) మరణించారు.
కాగా.. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలానికి మేయర్ నీరజ, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
Also Read: