TV9 for Better Society: మెరుగైన సమాజం కోసం జనహితం.. టీవీ9 ఎప్పుడూ ప్రజల పక్షమే.. డమ్మీరాతలపై టీవీ9 అక్షర సమరం..

మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ9 ఎప్పుడూ ప్రజల పక్షమే! అన్ని వేళలా ప్రజలకు అండగానే నిలుస్తూ వచ్చింది.. ఇక ముందు కూడా నిలుస్తుంది..

TV9 for Better Society: మెరుగైన సమాజం కోసం జనహితం.. టీవీ9 ఎప్పుడూ ప్రజల పక్షమే.. డమ్మీరాతలపై టీవీ9 అక్షర సమరం..
Tv9 For Better Society, Best Communication
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 11, 2021 | 11:17 AM

TV9 for Better Society: మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ9 ఎప్పుడూ ప్రజల పక్షమే! అన్ని వేళలా ప్రజలకు అండగానే నిలుస్తూ వచ్చింది.. ఇక ముందు కూడా నిలుస్తుంది.. కరోనా కాలంలో మానవత్వం మరచి కాసుల కక్కుర్తిలో పడినవారి బాగోతాలను వెలుగులోకి తెచ్చింది టీవీ నైనే! కరోనా పేషంట్లకు అత్యంత అవసరమైన ఇంజక్షన్‌ రెమిడిసెవర్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్న అక్రమార్కులను కాలర్‌ పట్టి జనం ముందు నిలబెట్టింది టీవీ నైనే! ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టింది టీవీ నైనే! అదే సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలను ప్రశంసిస్తూ పలు పాజిటివ్‌ కథనాలను ప్రసారం చేసింది కూడా టీవీనైనే! టీవీ 9కు ప్రజల మద్దతే బలం. ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ము చేయలేదు. అందుకే ఆది నుంచి నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాం.. ప్రజల అండదండలతో ఇక ముందు కూడా ఉంటాం!

కరోనా వైరస్‌ దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ మహమ్మారి పట్ల ప్రజలలలో అవగాహన పెంచేందుకు అవిరళ కృషి చేసింది టీవీ 9. కరోనా పేషంట్లకు ధైర్యాన్ని నూరిపోసింది. ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సలహాలను సూచనలను ప్రసారం చేసింది. హాస్పిటల్స్‌లో పేషంట్లు పడుతున్న సాధక బాధకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి వారికి తక్షణ చర్యలు చేపట్టేలా చేసింది. ప్రయివేటు హాస్పిటల్స్‌ దోపిడిని ఎండగట్టింది.. వారి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లక్షలకు లక్షలకు గుంజుతున్న హాస్పిటల్స్‌ భరతం పట్టింది. బెడ్స్‌ అమ్ముకుంటున్న అక్రమార్కులపై కొరడా ఝళిపించింది.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్‌ను బ్లాక్‌మార్కెట్‌లు అమ్ముకుంటున్న కేటుగాళ్ల అక్రమ దందాను వెలుగులోకి తెచ్చింది. టీవీ9 చేపట్టిన నిఘా ప్రభుత్వాన్ని కూడా కదిలించింది.విశాఖ అరిలోవలోని రెఫరెల్‌ హాస్పిటల్‌లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌ నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలను బయటపెట్టింది.

కరోనా చాటున నిలువు దోపిడీ చేస్తూ…. కరోనా కల్లోల సమయంలో కూడా… మానవత్వం మరిచి… నీచానికి దిగజారిన బ్లాక్‌ దందా బ్లెడీ బద్మాష్‌లకు శిక్షపడేలా చేసింది టీవీ 9. విశాఖలో వ్యాక్సిన్‌లను అమ్ముకుంటున్న మోసగాళ్ల బండారం బయటపెట్టింది. విశాఖలోని ఆరిలోవలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నడిచే ఫస్ట్ రెఫరెల్ హాస్పిటల్‌లో ఆశా వర్కర్‌గా పని చేస్తున్నారు సునీత.. . ఆమె బ్లాక్‌లో వ్యాక్సిన్‌ అమ్ముతున్నారని తెలుసుకున్న టీవీ9 టీమ్‌.. తమకూ వ్యాక్సిన్‌ కావాలని వెళ్లింది. మంచి గిరాకీ దొరికిందని అనుకున్న ఆమె… టీవీ9 టీమ్‌తో బేరానికి దిగింది. కోవాగ్జిన్‌ టీకాకు ఐదు వేలు డిమాండ్‌ చేసింది. ఈ క్రింది స్థాయి సిబ్బంది వెనుక పెద్ద వ్యక్తులే ఉన్నారు. వాళ్లు బయటకు రాకుండా.. వీరితో వ్యాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌ చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇది స్థానికులు అంటున్న మాట!

Covid Vaccine

Covid Vaccine

ఆంధ్రప్రదేశ్‌లో.. వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో.. ముందుగా.. 45 ఏళ్లకు పైబడిన వారికే వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ… టీవీ 9 నిఘా బయటపెట్టేంత వరకు మాత్రం కాసులు వెదజల్లితే చాలు.. వయస్సుతో పనిలేదు… ఎవరికైనా.. వ్యాక్సిన్‌ బ్లాక్‌లో దొరికేది. ఇంకో మోసాన్ని కూడా టీవీ 9 వెలికి తీసింది. సాధారణంగా ఒక వయల్ నుంచి 0.5 MLచొప్పున 12 మందికి వేయొచ్చు. కొన్ని సార్లు అది పది మందికే సరిపోవచ్చు. కానీ.. డబ్బులు తీసుకున్న వారికి 0.5 ML కాకుండా తక్కువ మోతాదులో వేశారు. టీవీ 9లో ఇదంతా ప్రసారం అయిన తర్వాత వీరి అక్రమాలకు బ్రేక్‌ పడ్డాయి.

కరోనా విస్తరిస్తున్న విపత్కర సమయంలో మందులు, ఇంజెక్షన్లను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ పాపిష్టి సొమ్మును గడిస్తున్న పాపులను చట్టానికి పట్టి ఇచ్చింది టీవీ9. కరోనా చికిత్సకు ప్రస్తుతం అత్యవరసమైన ఇంజెక్షన్‌ రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్నవారిని, .పేషంట్ల అవసరాన్ని గమనించి ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నవారిని కటకటాల వెనుకాల నెట్టించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసింది.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం.. ఇలా ప్రతి చోటా అక్రమార్కులను పట్టి ఇచ్చింది టీవీనైనే! నకిలీ రెమ్‌డెసివిర్‌లు తయారు చేసి అమ్ముకుంటున్నార వారిని కూడా వదిలిపెట్టలేదు.

కరోనా పేషంట్లపై కాసింత కూడా కనికరం లేకుండా లక్షలకు లక్షలు వసూలు చేసిన ప్రయివేటు హాస్పిటల్స్‌ తాట తీసింది టీవీ9. కోవిడ్‌ చికిత్సల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న పలు ప్రైవేటు ఆస్పత్రుల అరాచకాన్ని టీవీ9 ప్రత్యేక కథనాలను నిరంతరాయంగా అందించింది. కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల ధన దాహానికి ఎన్నో కుటుంబాలు దారుణంగా నష్టపోయాయి. విచ్చలవిడిగా దోపిడీకి తెరలేపిన ప్రైవేటు వైద్యంపై నిగ్గుతేల్చింది. ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస ఘటనలు వీటికి ఉదాహరణ నిలుస్తున్నాయి. కోవిడ్‌ బాధితులకు చికిత్సలు చేయాలంటే ముందుగా లక్షల రూపాయలు అడ్మిషన్‌ కింద చెల్లిస్తేనే హాస్పిటల్‌లో బెడ్‌లు కేటాయిస్తున్నారు.

ఇలాంటి ఎన్నో కథనాలను నిత్యం వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9. కోవిడ్‌ పేరుతో ప్రయివేట్‌ హాస్పిటల్స్‌లో జరుగుతున్న దోపిడీని ప్రత్యేక కథనాలుగా ప్రసారం చేసింది.. వెబ్‌ సైట్‌‌లో ప్రచూరించింది. టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దోపిడీకి అడ్రస్‌గా మారుతున్న ఆస్పత్రులపై వేటు వేసింది. అటు ఏపీ ప్రభుత్వం టీవీ9 కథనాలకు స్పందించింది.. ఇష్టానికి దోచుకుంటున్న ప్రయివేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంది.

అవినీతి, అక్రమాలు, అరాచకాలు లేని సమాజాన్ని టీవీ9 కోరుకుంటోంది.. సామాజిక బాధ్యతను ఏనాడు విస్మరించలేదు. కుల, మత, వర్గ సమాజం కోసం పాటుపడుతుంది. అడ్డంగా దోచుకున్నవారెవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టదు టీవీ9.. అంకితభావంతో, అంతఃకరణశుద్ధితో ప్రయాణం సాగిస్తున్న టీవీ9పై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు..ఇంత చేసినా ఏమీ చేయలేదనే అపవాదును వేస్తూ శునకానందం పొందుతున్నారు. ఎవడి ఖర్మానికి వాడేపోతాడని ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు.. ఇక ఉపేక్షించం.. టీవీ9పై అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టం. చట్టరిత్యా వారిపై చర్యలు తీసుకోడానికి వెనుకాడం. ఇది అంతిమ హెచ్చరిక! Read Also…. Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!